ETV Bharat / city

పోలీసుల అదుపులో వామన్‌రావు దంపతుల హత్య కేసు నిందితులు - వామన్‌రావు దంపతుల హత్య కేసు

peddapalli police arrested the 4 accused in Vamanrao couple murder case
పోలీసుల అదుపులో వామన్‌రావు దంపతుల హత్య కేసు నిందితులు
author img

By

Published : Feb 18, 2021, 5:23 PM IST

Updated : Feb 18, 2021, 6:12 PM IST

17:21 February 18

పోలీసుల అదుపులో వామన్‌రావు దంపతుల హత్య కేసు నిందితులు

వామన్‌రావు దంపతుల హత్య కేసు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య కేసుకు సంబంధించి నలుగురిని పెద్దపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల అదుపులో ఎ-1 వెల్ది వసంతరావు, ఎ-2 కుంట శ్రీనివాస్‌, ఎ-3 అక్కపాక కుమార్‌, చిరంజీవి ఉన్నారు. మొత్తం 6 బృందాలను ఏర్పాటు చేసి నిందితులను పట్టుకున్నారు. 

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ కేసును నార్త్ జోన్​ ఐజీ నాగిరెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇవాళ రాత్రి నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసుపై హైకోర్టు స్పందించింది. సుమోటోగా స్వీకరించి... దర్యాప్తు నివేదికను సమర్పించాలని ఆదేశించింది.   

సంబంధిత కథనాలు: న్యాయవాదుల హత్యకు కారణమేంటి? అసలేం జరిగింది?

Last Updated : Feb 18, 2021, 6:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.