వచ్చే సంవత్సరమైనా సీతారాముల కల్యాణం కోట్లాది ప్రజల సమక్షంలో జరగాలని కోరుకుంటున్నానని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో జరిగిన స్వామి వారి కల్యాణ వేడుకల్లో మంత్రి ఈటల, జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ కనుమల్ల విజయ పాల్గొన్నారు.
తొలుత రామయ్యకు పట్టు వస్త్రాలు సమర్పించిన ఈటల.. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. కల్యాణ మహోత్సవం అనంతరం.. ఆలయ అర్చకులు మంత్రిని సన్మానించారు.
శ్రీరామనవమి వేడుకలు.. దేశవ్యాప్తంగా వాడవాడలా జరిగేవని ఈటల గుర్తుచేసుకున్నారు. కరోనా విజృంభణతో గత రెండేళ్లుగా ఇంట్లోనే వేడుకలు నిర్వహించుకుంటున్నామన్నారు. వచ్చే ఏడాది కోట్లాది ప్రజల సమక్షంలో జరగాలని కోరుకుంటున్నానని తెలిపారు. కరోనా బారిన పడిన ముఖ్యమంత్రి కేసీఆర్.. త్వరగా కోలుకోవాలని స్వామివారిని కోరుకున్నట్లు మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.
ఇవీచూడండి: భద్రాద్రిలో కనుల పండువగా సీతారాముల కల్యాణం