ETV Bharat / city

ఇంటి పన్ను చెల్లించలేదని... ఇంటి ముందే డంపింగ్ యార్డ్..

Garbage in Front of home at jagityala: మున్సిపాలిటీ అధికారులు ఈ మధ్య కాలంలో పన్ను వసూళ్ల కోసం కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తున్నారు. ఇంటిపన్ను చెల్లించకపోతే నీటి సరఫరా నిలిపివేయడం, నోటీసులు ఇవ్వడం వంటివి చేస్తారు. కానీ జగిత్యాల పురపాలక సిబ్బంది చేసిన నిర్వాకం అందరినీ విస్తుపోయేలా చేసింది.

Garbage in Front of home
Garbage in Front of home
author img

By

Published : Mar 24, 2022, 4:24 PM IST

Garbage in Front of home at jagityala: జగిత్యాల జిల్లా మున్సిపాలిటీ అధికారులు పన్ను వసూళ్లను సీరియస్​గానే తీసుకున్నారు. నయానో భయానో చెబితే కుదరడం లేదని.. కొత్తగా ఆలోచించారు. ఎప్పటిలా ఇంటిపన్ను చెల్లించకపోతే నీటి సరఫరా నిలిపివేయకుండా...కొత్త దారిలో వెళ్లారు. ఓ ఇంటి యజమాని పన్ను చెల్లించలేదని ఇంటి ఆవరణాన్ని డంపింగ్‌ యార్డుగా మార్చారు. ఇంటి ముందు చెత్త పోసి పన్ను చెల్లించాలని డిమాండు చేశారు. దీంతో బాధితుడు ఆందోళనకు దిగారు.

మున్సిపల్ కమిషనర్ ఆదేశం మేరకు..

Jagityala Municipality: జగిత్యాలలోని బంజారు దొడ్డివాడకు చెందిన అహ్మద్‌ బిన్‌సాలెం ఇంటిపన్ను రూ.50 వేలు, మరో రూ.50 వేలు వడ్డీతో కలిపి లక్ష బాకీ పడ్డాడు. పన్ను చెల్లించాలని ఎన్ని సార్లు సూచించిన ఇంటి యజమాని పట్టించుకోకపోవటంతో మున్సిపల్‌ కమిషనర్‌ స్వరూపరాణి ఆదేశం మేరకు సిబ్బంది ట్రాక్టర్‌తో చెత్తను తెచ్చి ఇంటిముందు పోశారు. దీంతో బాధితుడు సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. తన ఆర్థిక పరిస్థితి బాగాలేక చెల్లించలేక పోయానని రూ.25 వేలు చెల్లిస్తానన్నా తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

జగిత్యాలలో పన్ను చెల్లించలేదని ఇంటి ముందు చెత్త వేసిన మున్సిపల్ సిబ్బంది

ఇదీ చదవండి:CM KCR Kolhapur Visit : 'దేశం ప్రగతి పథంలో సాగాలని అమ్మవారిని వేడుకున్నా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.