డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో జాప్యం జరగకుండా చూడాలని మంత్రి గంగుల కమలాకర్ అధికారులను సూచించారు. కరీంనగర్ నియోజకవర్గంలో 1400 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు కాగా.. దాదాపు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు టెండర్ ప్రక్రియ పూర్తి అయిందని మంత్రి పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణానికి ఏవైనా అడ్డంకులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు. చాలా గ్రామాల్లో ఇళ్ల నిర్మాణానికి భూమి కొరత ఉందని.. కలెక్టర్‌తో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని గంగుల స్పష్టం చేశారు.
లక్ష్యాన్ని అధిగమించాలి..
ప్రభుత్వం చేపట్టిన ఆరో విడత హరితహారం.. ఆగస్టు మొదటివారంలోగా లక్ష్యాన్ని అధిగమించాలని గంగుల ఆదేశించారు. నగరంలో యాదాద్రి తరహాలో ఒక లక్షా 20వేల మొక్కలను 33 ఎకరాల్లో నాటుతున్నట్లు తెలిపారు. బ్లాక్ పద్దతిలో 21.50 ఎకరాల్లో 19,600 మొక్కలను నాటుతున్నామని వెల్లడించారు. సమీక్షలో జిల్లా కలెక్టర్ శశాంక, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: సమస్య ఈటీవీకి చేరింది... వెంటనే రోగులకు సాయం అందింది