కరీంనగర్ పరిధిలో నిర్వహించనున్న ధరణి సర్వేకు ప్రజలు సహకరించాలని మేయర్ సునీల్‌రావు, కమిషనర్ క్రాంతి విజ్ఞప్తి చేశారు. 10 రోజుల్లో సర్వే పూర్తి చేస్తే ఆ తర్వాత ధరణి వెబ్‌సైట్‌లో ఆస్తులు అప్‌డేట్ చేయడానికి వీలు కలుగుతుందని పేర్కొన్నారు. సర్వే గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... ఆస్తులకు సంబంధించిన వివరాలు, ఇంటి నంబర్ తమ వద్ద ఉన్నాయని పేర్కొన్న కమిషనర్... అదనపు సమాచారాన్ని మాత్రమే సేకరిస్తామని చెప్పారు.
48 కాలమ్స్‌తో ఉన్నఈ సర్వేను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నామన్నారు. అవగాహన ఉన్న వారు నేరుగా తమ ఆస్తుల వివరాలు ఆన్‌లైన్ ద్వారా స్వయంగా నమోదు చేసుకోవచ్చని సూచించారు. సాధ్యమైనంత త్వరగా వివరాలు సేకరించి... ఆస్తులకు సంబంధించిన పాస్‌పుస్తకాలు జారీ చేస్తామని మేయర్ వివరించారు.