తెలంగాణ ఏర్పడిన తర్వాత కాంట్రాక్ట్ లెక్చరర్ల జీవితాలు బాగుపడతాయనుకుంటే, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉందని టీఎల్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగయ్య వాపోయారు. ప్రభుత్వాలు మారినా కాంట్రాక్ట్ లెక్చరర్ల జీవితాలు మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ లయోలా జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మూల్యాంకనం ఉండగా, లెక్చరర్లు భోజన విరామ సమయంలో కళాశాల ఆవరణలో నిరసన చేపట్టారు. వేతనాలు పెంచాలని నినాదాలు చేశారు. సమస్యను పరిష్కరించని యెడల ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
'ప్రభుత్వాలు మారినా కాంట్రాక్ట్ లెక్చరర్ల జీతాలు మారలే' - intermediate
కరీంనగర్ జిల్లాలో కాంట్రాక్ట్ లెక్చరర్లు ఆందోళన బాట పట్టారు. తమకు వేతనాలు వెంటనే పెంచాలని టీఎల్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగయ్య డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు మారినా తమ జీవితాలు మారలేదని, ఇప్పటికైనా స్పందించకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత కాంట్రాక్ట్ లెక్చరర్ల జీవితాలు బాగుపడతాయనుకుంటే, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉందని టీఎల్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగయ్య వాపోయారు. ప్రభుత్వాలు మారినా కాంట్రాక్ట్ లెక్చరర్ల జీవితాలు మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ లయోలా జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మూల్యాంకనం ఉండగా, లెక్చరర్లు భోజన విరామ సమయంలో కళాశాల ఆవరణలో నిరసన చేపట్టారు. వేతనాలు పెంచాలని నినాదాలు చేశారు. సమస్యను పరిష్కరించని యెడల ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
రిపోర్టింగ్ & కెమెరా : బి. మారయ్య, ఈటీవీ , సుర్యాపేట.
( ) సూర్యాపేట కలెక్టర్ ఆమోయ్ కుమార్ సుర్యాపేట గ్రామీణ బాలెంల గ్రామంలో ఉన్న పశువుల ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించేందుకు వచ్చిన కలెక్టర్ అక్కడి పోలింగ్ కేంద్రం పక్కనే ఉన్న పశువుల ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ జరిపారు. సరిగ్గా కలెక్టర్ తనిఖీ సమయంలో ఆసుపత్రి అచ్చం పశువుల సంతను తలిపించింది. ఆసుపత్రి గదుల్లో ఓషధాలు , ఓషధ బాటిళ్లు చిందర వందరగా పడిఉన్నాయి. ఇది చూసిన కలెక్టర్ కు ఆగ్రహం తెప్పించింది. దాంతో వైద్యుడిని పిలిపించికుని మందలించారు. కార్యాలయాలను తమ సొంత ఇంటిలా భావించాలని సూచించారు.
Body:.....
Conclusion:.....