కరీంనగర్‌లో కరోనా పరీక్షల కోసం రెండు నెలల క్రితం ఆర్టీపీసీఆర్ ల్యాబ్ ఏర్పాటు చేసినా.. ఇంతవరకు వినియోగంలోకి రాలేదు. పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయినా.. ఐసీఎంఆర్ నుంచి అనుమతి రాకపోవడంతో ఇప్పటికీ.. నమునాలను హైదరాబాద్‌కు పంపిస్తున్నారు. ఫలితంగా నమూనాల కోసం మూడు నుంచి వారం రోజులు వేచి ఉండాల్సి వస్తోంది.
లక్షణాలు ఉన్నవారికి యాంటీజెన్ పరీక్షలో నెగిటివ్ వచ్చినప్పుడు.. విధిగా ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలని ఐసీఎంఆర్ మార్గదర్శకాలు సూచిస్తున్నాయి. ఆ కేంద్రం ప్రారంభం కాకపోవడంతో.. పరీక్షలకు వచ్చినవారు ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రం నుంచి అనుమతి రాగానే పరీక్షలు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని జిల్లా వైద్యాధికారి సుజాత తెలిపారు.
ఇవీ చూడండి: సోమవారం నుంచి ఆస్పత్రుల్లో సాధారణ వైద్య సేవలు