ETV Bharat / city

రాష్ట్ర జలదృశ్యంలో మరో కీలకఘట్టం ఆవిష్కృతం - కాళేశ్వరం ప్రాజెక్ట్

రాష్ట్ర జలదృశ్యంలో మరో కీలకఘట్టం ఆవిష్కృతమైంది. తడారిన మంజీరాలో ప్రవాహాలు లేక వట్టిపోతున్న నిజాంసాగర్ జలకళ సంతరించుకోనుంది. ప్రాణహిత మిళిత దిగువ గోదావరి జలాలు.. హల్దీవాగు ద్వారా మంజీరాను సజీవం చేస్తూ నిజాంసాగర్‌ను ముద్దాడనున్నాయి. దీంతో రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి పూర్తి చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు మరో కీలక మైలురాయిని చేరుకొని సరికొత్త చరిత్రను లిఖించినట్లైంది.

kaleshwaram project going to reach major milestone in the history
రాష్ట్ర జలదృశ్యంలో మరో కీలకఘట్టం ఆవిష్కృతం
author img

By

Published : Apr 7, 2021, 5:31 AM IST

రాష్ట్ర జలదృశ్యంలో మరో కీలకఘట్టం ఆవిష్కృతం

కోటి పాతిక ఎకరాల మాగాణి లక్ష్యసాధన దిశగా.. మరో ముందడుగు పడింది. ఎగువ రాష్ట్రాల విచ్చలవిడి ఆనకట్టలు, ప్రాజెక్టులతో వట్టి పోతున్న రాష్ట్రంలోనూ నదులు, జలాశయాలు ఒక్కక్కటిగా జలకళ సంతరించుకుంటున్నాయి. రీడిజైన్ ద్వారా కాళేశ్వరం ఎత్తిపోతల బృహత్ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టి రికార్డు సమయంలో పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పటికే 518 మీటర్ల ఎగువకు నీటిని ఎత్తిపోస్తోంది. ప్రాణహిత నీటితో కూడిన గోదావరి జలాలు దశల వారీగా మేడిగడ్డ నుంచి కొండపోచమ్మ సాగర్ వరకు చేరాయి. ఆనకట్టలు, భారీ పంపుహౌస్‌లు, సొరంగాలు, కాల్వల ద్వారా కాళేశ్వర గంగ శరవేగంగా ఎగువకు ప్రవహిస్తోంది. నీరు పల్లమెరుగు అన్న నానుడికి భిన్నంగా.. గోదావరి నదికి కొత్త నడక నేర్పినట్లైంది. తాజాగా ప్రాజెక్టులో మరో కీలకఘట్టం ఆవిష్కృతమైంది. గోదావరి తరహాలోనే మంజీరా కూడా ఎగువ రాష్ట్రాలు, వరుణుడి చిన్నచూపు బాధితురాలైంది. ఫలితంగా మంజీరాలోనికి నీటి రాక గగనమైంది. దీంతో రెండున్నర లక్షలకు పైగా ఎకరాల ఆయకట్టుకు అండగా ఉండాల్సిన నిజాంసాగర్ అంతంతగానే సాగునీరిస్తోంది.

జూన్ కల్లా పూర్తి చేయాలన్న లక్ష్యంతో..

మంజీరా, నిజాంసాగర్‌ను నమ్ముకున్న వారి గోస కూడా తీరుస్తామని, కాళేశ్వరం జలాలను మల్లన్నసాగర్ ద్వారా.. సింగూరుకు, మంజీరాకు తరలిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ పునారాకృతి ప్రణాళికల సమయంలోనే ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోనే అత్యంత పెద్దదైన 50 టీఎంసీల సామర్థ్యం ఉన్న మల్లన్నసాగర్ జలాశయం పనులు తుదిదశలో ఉన్నాయి. కొంత మేర మాత్రమే నీటిని నింపారు. దీంతో ప్రస్తుతం తాత్కాలికంగా కొండపోచమ్మ జలాశయం నుంచే మంజీరాను నీటిని తరలించే కార్యాచరణను చేపట్టింది. అందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కొండపోచమ్మ జలాశయం జలాలను సంగారెడ్డి కాల్వ ద్వారా.. హల్దీవాగులోకి వదిలారు. హల్దీవాగు ద్వారా ప్రవహించి మంజీరాలో పడి.. అక్కణ్నుంచి నీరు నిజాంసాగర్ కు చేరుతుంది. మల్లన్నసాగర్ పనులను జూన్ కల్లా పూర్తి చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. పనులు పూర్తయితే అక్కణ్నుంచే.. సింగూరు, హల్దీవాగులోకి జలాలను తరలిస్తారు. దీంతో ఇక నుంచి మంజీరా, నిజాంసాగర్‌పై ఆధారపడ్డ రైతులకు పూర్తి ప్రయోజనం కలగనుంది.

బీడు భూములకు జీవం పోస్తూ..

నిజాంసాగర్ నుంచి జలాలు శ్రీరాంసాగర్‌కు కూడా చేరనున్నాయి. అదే జరిగితే దిగువ గోదావరి జలాలు.. వందల కిలోమీటర్లు ఎదురీది.. 518 మీటర్ల ఎత్తుకు ఎగజిమ్మి ఎగువ గోదావరిని సుసంపన్నం చేయనున్నాయి. ఫలితంగా గోదావరి నది ఒక హారంలా చుట్టేస్తూ బీడు భూములకు జీవం పోస్తూ ముందుకు సాగనుంది. మల్లన్నసాగర్ జలాశయం పూర్తి కావడంతో పాటు.. గంధమల్ల, బస్వాపూర్ జలాశయాలు, మధ్యలో ఉన్న ఇతర ప్యాకేజీల పనులు పూర్తయితే కాళేశ్వరం ప్రాజెక్టులోని మైలురాళ్లను అన్నింటినీ.. అధిగమించిన్నట్లే. కోటీ పాతిక లక్షల మాగాణి లక్ష్యసాధనలో అత్యంత కీలక పాత్ర పోషించనుంది.

ఇవీ చూడండి: మంజీరా నదిలోకి కాళేశ్వర గంగ... పంటపొలాలు మురిసిపడంగా...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.