పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో.. సుమారు రెండు గంటలపాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఈదురు గాలులు, ఉరుములతో కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. వర్షం వల్ల ప్రధాన రహదారులు నీటిలో మునిగిపోయాయి. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో భారీ వర్షానికి మురుగు కాలువలు పొంగిపొర్లి ఇళ్లలోకి చేరాయి.
సామగ్రి పూర్తిగా నీటిలో..
47వ డివిజన్లో వర్షం నీరు ఇళ్లలోకి చేరడంతో సామగ్రి పూర్తిగా నీటిలో మునిగిపోయింది. వర్షపు నీరు ఇళ్లలోంచి బయటకు పంపించేందుకు కాలనీవాసులు నానా అవస్థలు పడాల్సి వచ్చింది. ఒకరోజు వర్షానికే.. ప్రధాన రహదారులతో పాటు ఆయా డివిజన్లలో వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు వర్షం నీరు ఇళ్లలో చేరకుండా చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు. వర్షాకాలంలో తగిన చర్యలు చేపట్టకపోవడంతో ఇళ్లలోకి వర్షం నీరు చేరిందని కాలనీవాసులు అధికారులపై మండిపడుతున్నారు.
ఇదీ చదవండి: Rains: తెలంగాణలో రేపు ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు