ETV Bharat / city

Congress Meeting: హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక నేడే... బరిలో నిలిచేది ఆమేనా?

author img

By

Published : Aug 30, 2021, 9:07 AM IST

హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై నేడు స్పష్టత రానుంది. గాంధీ భవన్​లో జరిగే ముఖ్య నాయకుల సమావేశంలో పీసీసీ తుది నిర్ణయం తీసుకోనుంది. అభ్యర్థి ఎంపికపై పార్టీ నాయకుల్లో ఐక్యత తీసుకొచ్చి ఏకగ్రీవంగా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ పేరు ఖరారు అయ్యే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Congress Meeting
కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక

తెలంగాణలో ప్రతిష్ఠాత్మకంగా మారిన హుజూరాబాద్​ ఎన్నికల్లో కాంగ్రెస్​ నుంచి అభ్యర్థిని దింపేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ విషయమై నేడు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జ్​ మాణిక్కం ఠాగూర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షులు, సీనియర్ ఉపాధ్యక్షులు, వివిధ కమిటీల ఛైర్మన్లు గాంధీ భవన్​లో సమావేశం అవుతున్నారు. అభ్యర్థి ఎంపికపై సుదీర్ఘంగా చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే పీసీసీ ఎన్నికల నిర్వహణ కమిటీ పలుమార్లు అభ్యర్థి ఎంపికపై సమీక్ష చేశారు.

పీసీసీ ఎన్నికల కమిటీ ఛైర్మన్‌ దామోదర రాజనరసింహ నేతృత్వంలో... ఎన్నికల బరిలో దిగేందుకు ఆసక్తి చూపుతున్న పలువురు నాయకులతో కమిటీ చర్చించింది. ఇప్పటికే ముగ్గురు అభ్యర్థుల జాబితాతో కూడిన నివేదికను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి అందజేశారు. రేవంత్​రెడ్డి ద్వారా ఆ నివేదికను కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి నివేదించారు. ఈ నేపథ్యంలో ఆ నివేదికతో పాటు... ఆసక్తి చూపుతున్న నాయకులకు సంబంధించి పూర్తిస్థాయిలో సీనియర్లు సమావేశంలో చర్చించనున్నారు.

స్థానిక పరిస్థితులకు అనుగుణంగా..

హుజూరాబాద్​లో తెరాస, భాజపా అభ్యర్థులను ధీటుగా ఎదుర్కొని ఓటింగ్ శాతాన్ని పెంచుకునే నాయకుడిని బరిలో దించాలని ఇప్పటికే పీసీసీ నిర్ణయించింది. గతంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 61 వేలకు పైగా ఓట్లు రావడంతో... ఈసారి ఉప ఎన్నికల్లో మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని పీసీసీ భావిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు భాజపా వైపు చీలిపోకుండా కాంగ్రెస్ వైపు తెచ్చుకోవడానికి కసరత్తు చేస్తోంది. గ్రామ, బూత్, మండల స్థాయిలో నాయకులు... క్షేత్రస్థాయి పరిస్థితులను మెరుగు పరిచేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు. మండల, గ్రామ స్థాయిలో సమావేశాలు నిర్వహించి... స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

హుజూరాబాద్​లో పార్టీని బలోపేతం చేయడంతో పాటు గట్టి అభ్యర్థిని బరిలోకి దింపడం ద్వారా సాధారణ ఎన్నికల్లో వచ్చిన ఓటింగ్ శాతం కంటే మరింత ఎక్కువ తీసుకురావాలని కాంగ్రెస్ భావిస్తోంది. ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖను బరిలో దించాలని పార్టీ వర్గాలు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెరాస... భాజపా పార్టీలు అభ్యర్థుల ప్రకటన చేసి ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థిని ప్రకటించి ప్రచారానికి శ్రీకారం చుట్టాలని భావిస్తోంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యకలాపాలపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తోంది. దళితులను మోసం చేసేందుకే దళితబంధు తీసుకొచ్చారంటూ ప్రచారం చేస్తోంది. హుజూరాబాద్​ అభివృద్ధితో పాటు.. ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వ్యవహరించాలి.. ప్రచారం ఏ విధంగా చేయాలి అనే తదితర అంశాలపై కూడా ముఖ్య నాయకుల చర్చించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇదీ చూడండి: Congress: హుజూరాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా కొండా సురేఖ దాదాపు ఖరారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.