తెరాస, భాజపాలకు ఓట్లు అడిగే హక్కు లేదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఆయన మాట్లాడారు. విభజన హామీలు ఒక్కటి కూడా అమలుకావడం లేదని ఆరోపించారు. రిజర్వేషన్లు ఖరారు కాకుండానే పురపాలక అభ్యర్థులను ప్రకటిస్తామని మంత్రి కేటీఆర్ ఏవిధంగా చెబుతారని ప్రశ్నించారు. ప్రభుత్వ కనుసన్నల్లోనే ఎన్నికల అధికారులు పనిచేస్తున్నారని పొన్నం అనుమానం వ్యక్తం చేశారు. అన్ని ప్రక్రియలు పూర్తిచేసి నోటిఫికేషన్ ఇవ్వాలని కోర్టు ఆదేశించినా.. ఓటర్ జాబితా కూడా ఇవ్వకుండానే నోటిఫికేషన్ ఇవ్వడంలో ఆంతర్యమేంటని పొన్నం ప్రశ్నించారు.
ఇవీచూడండి: సర్వమతాల సౌభ్రాతృత్వమే తెరాస లక్ష్యం