హోలీ పండుగ సందర్భంగా సిద్ధిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో చిన్నారులు సందడి చేశారు. ఒకరిపై ఒకరు రంగునీళ్లు చల్లుకుంటూ పండుగను ఆనందంగా జరుపుకున్నారు. చిన్నపిల్లలైనప్పటికీ సహజ రంగులతో హోలీ ఆడి శెభాష్ అనిపించారు.
పసుపు, కుంకుమ, గోగిపువ్వులతో తయారుచేసిన రంగులను ప్లాస్టిక్ బాటిల్స్‌లో నింపి ఒకరిపై ఒకరు చల్లుకొని సందడి చేశారు. వీధుల్లో కేరింతలు కొట్టారు. స్నేహితుల ఇళ్లకు వెళ్లి వారిని కూడా జత కలుపుకొని పండుగ జరుపుకొన్నారు.