కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో భాజపా రాష్ట్ర అధ్యక్షులు, స్థానిక ఎంపీ బండి సంజయ్‌కుమార్ పర్యటించారు. స్థానికులతో మాట్లాడి పలు సమస్యల వివరాలను తెలుసుకున్నారు. అనంతరం గత నాలుగు రోజులుగా కురుస్తోన్న వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులతో ఆయన మాట్లాడారు. పంట నష్టాల వివరాలు తెలుసుకున్నారు.
జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయని, రహదారులు అస్తవ్యస్తంగా మారాయని బండి సంజయ్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను చేశారని.. కొద్దిపాటి వర్షానికే డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా నాశనం అయిందని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు రాజకీయాలకు అతీతంగా నగర అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.
ఇదీచూడండి: ఆ ఎమ్మెల్యే చేసిన పనికి కేటీఆర్ అభినందన