కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా... మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మరో ఏడుగరు స్వల్పంగా గాయపడ్డారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూరు వైపు వెళ్తున్న ట్రాక్టర్‌ను హుజూరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న వారు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న ఎస్సై తిరుపతి తన సిబ్బందితో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని... పోలీసు వాహనంలోనే హుజురాబాద్ సివిలాసుపత్రికి తరలించారు. అప్పటికే ఇద్దరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా మారటంతో వరంగల్ ఎంజీంఎం ఆసుపత్రికి తరలించారు. మరో ఏడుగురికి హుజురాబాద్ ఆసుపత్రిలోనే చికిత్స అందించారు.
క్షతగాత్రులంతా... బిహార్‌కు చెందిన వారని ఎస్సై తిరుపతి తెలిపారు. మృతుల వివరాలు సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రమాదంపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. ప్రమాద స్థలాన్ని హుజూరాబాద్ ఏసీపీ కోట్ల వెంకట్‌రెడ్డి, గ్రామీణ సీఐ ఎర్రల కిరణ్ పరిశీలించారు.
ఇదీ చూడండి: Loan App Case: దర్యాప్తు చేస్తున్న ఈడీ అధికారిపై సీబీఐ కేసు