ETV Bharat / city

'మంత్రిగారూ కంగ్రాచ్యులేషన్స్'.. వైకాపా ఎమ్మెల్యేలకు సహచరుల విషెస్ - ap latest news

YSRCP leaders congratulates MLA's: ‘మంత్రి గారూ కంగ్రాచ్యులేషన్స్‌’ అంటూ పలువురు వైకాపా ఎమ్మెల్యేలకు.. వారి సహచరులు శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ మంత్రివర్గాన్ని అతి త్వరలో పునర్‌వ్యవస్థీకరిస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం జగన్‌ ప్రకటించిన నేపథ్యంలో ఈ విధంగా అభినందనలు తెలిపారు.

YSRCP leaders congratulates MLA's
YSRCP leaders congratulates MLA's
author img

By

Published : Mar 16, 2022, 10:49 AM IST

YSRCP leaders congratulates MLA's: ‘మంత్రి గారూ కంగ్రాచ్యులేషన్స్‌’ అంటూ మంగళవారం పలువురు వైకాపా ఎమ్మెల్యేలకు.. వారి సహచరులు సరదాగా శుభాకాంక్షలు తెలిపారు. వైకాపా శాసనసభాపక్ష సమావేశంలో మంత్రివర్గాన్ని అతి త్వరలో పునర్‌వ్యవస్థీకరిస్తున్నట్లు సీఎం జగన్‌ ప్రకటించారు. సమావేశం ముగిశాక.. కొత్త మంత్రివర్గంలో చోటు దక్కించుకునే అవకాశం ఉందన్న ప్రచారం నేపథ్యంలో.. ప్రభుత్వ విప్‌ దాడిశెట్టి రాజా, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాథ్‌, కొలుసు పార్థసారథి తదితరులకు వారి సహచర ఎమ్మెల్యేలు అభినందనలు తెలపడం అసెంబ్లీ లాబీల్లో కనిపించింది.

ఆ మూడు పార్టీలు కలుస్తాయా!

పార్టీ ఆవిర్భావ సభలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై అధికారపక్ష సభ్యుల మధ్య చర్చ సాగింది. జనసేన ఇప్పటికే భాజపాతో కలిసి ఉంది.. వారితో తెదేపా కలిసే అవకాశం ఉంటుందంటూ పలువురు ఎమ్మెల్యేలు, కొందరు మంత్రులు వేర్వేరుగా చర్చించుకోవడం కనిపించింది. ఆ మూడు పార్టీలూ కలిస్తే వైకాపాకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి?.. అని కొందరు కాపు సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు చర్చించుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.