ETV Bharat / city

'ఎవరమ్మా నువ్వు.. దీక్ష లేదు ఏంలేదు పో..' అంటూ అరెస్ట్.! - వైఎస్​ షర్మిల

వైఎస్​ఆర్​టీపీ అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల (YSRTP President YS Sharmila)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఆ పార్టీ శ్రేణులు వరంగల్- హైదరాబాద్ రహదారిపై ఆందోళనకు దిగాయి.

ys sharmila arest
ys sharmila arest
author img

By

Published : Sep 21, 2021, 5:27 PM IST

మేడ్చల్ జిల్లాలోని పీర్జాదిగూడలో వైఎస్​ఆర్​టీపీ అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల (YSRTP President YS Sharmila)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షర్మిల నిరుద్యోగ దీక్ష( YS Sharmila Hunger Strike On Unemployment)కు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. అయినా సరే షర్మిల దీక్షకు దిగేందుకు యత్నించగా అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల తీరును నిరసిస్తూ ఆ పార్టీ శ్రేణులు వరంగల్- హైదరాబాద్ రహదారిపై ఆందోళనకు దిగాయి. నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రహదారిపై వాహనాలు ఆగడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.

పార్టీ ప్రారంభం నుంచి ప్రతి మంగళవారం నిరుద్యోగ వారం పేరిట షర్మిల దీక్ష చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాలను పరామర్శిస్తున్నారు. అయితే ఈరోజు తలపెట్టిన వైఎస్​ షర్మిల నిరుద్యోగ దీక్షకు అనుమతి నిరాకరించిన పోలీసులు... దీక్షాస్థలి వద్ద ఏర్పాట్లును అడ్డుకున్నారు.

ఇదీ చూడండి: YS Sharmila Hunger Strike : 'ఇదేందక్కా ఇది.. దీక్షకు తీసుకొచ్చి పైసలు లేవంటారా?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.