భవిష్యత్ నిర్ణయించుకోవాల్సిన యువత బద్ధకిస్తోంది ఎందుకు...? - ghmc elections voting percentage
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటేసేందుకు నగరవాసులు ముందుకురావటంలేదు. ఈ ప్రక్రియలో ముందుండి అందరికీ అవగాహన కల్పిస్తూ... స్ఫూర్తి నింపాల్సిన యువతే అనాసక్తిని ప్రదర్శిస్తున్నారు. సుమారు 15 ఏళ్ల తర్వాత బల్దియాలో బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో పోలింగ్ మందకొడిగా సాగింది. ఓటింగ్లో యువత ఎందుకు పాల్గొనడంలేదు..? చైతన్యవంతమైన నగరంలో ఓటింగ్ శాతం ఎందుకు ఇంతగా తగ్గుతోంది...? తదితర అంశాలపై ముషీరాబాద్ యువతతో ఈటీవీ ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి.
youth voters interview about ghmc elections