కొద్ది రోజుల తరువాత చెరువు సమీప వీధి యువకులు పిచ్చికుంట బజారుకు మాస్క్ లేకుండా రావటంతో యలమంద బంధువులు అభ్యంతరం వ్యక్తం చేయగా ఈనెల 3న(శుక్రవారం) ఘర్షణ నెలకొంది. నలుగురు కర్రలతో యలమందపై దాడి చేశారు. అడ్డొచ్చిన కుమార్తె కర్నాటి ఫాతిమా(19) తలకు బలమైన గాయాలయ్యాయి. గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందింది. తండ్రి యలమంద ఫిర్యాదు మేరకు నలుగురిపై హత్య కేసు నమోదు చేసినట్లు ఎస్సై చల్లా సురేష్ తెలిపారు.
ఇదీ చదవండి : తెలంగాణలో కొత్తగా 1,269 మందికి కరోనా... మరో ఎనిమిది మంది మృతి