ETV Bharat / city

ప్రపంచానికి ఓ దారి.. జగన్​ది మరో దారి: రఘురామకృష్ణరాజు

మన భాష, సంస్కృతిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని ఆంధ్రప్రదేశ్​కు చెందిన వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. కేంద్ర ప్రభుత్వమే మాతృభాషలో విద్యా బోధన జరగాలని ఆదేశాలిచ్చిందని.. ఏపీ రాష్ట్ర విద్యా విధానంలో ఈ ఏడాది ఎలాంటి మార్పులు చేయవద్దని కోరారు.

ycp-rebel-mp-raghurama-krishna-raju-comments-on-national-education-policy
ప్రపంచమంతా ఓ దారి.. నాదో దారని జగన్ అనుకోవద్దు: రఘురామకృష్ణరాజు
author img

By

Published : Jul 30, 2020, 8:44 PM IST

ప్రాథమిక విద్యాభ్యాసం మాతృభాషలోనే జరగాలని పార్లమెంటులో మాట్లాడినందుకే. తనకు పార్టీ షోకాజ్‌ నోటీసులు ఇచ్చిందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. కానీ ఇప్పుడు కేంద్రం ప్రభుత్వమే మాతృభాషలోనే విద్యాభోధన కొనసాగించాలని ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. ప్రపంచమంతా ఒకదారి, నాదోదారి అని సీఎం జగన్​ అనుకోవద్దని హితవు పలికారు.

మన భాష, సంస్కృతిని పరిరక్షించుకోవాలన్న ఎంపీ.. ఏపీ విద్యా విధానంలో ఈ ఏడాది ఎలాంటి మార్పులు చేయవద్దని కోరారు. చిన్న రాష్ట్రాలు కూడా మాతృభాషకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నాయని చెప్పారు. ఆంగ్ల మాధ్యమాన్ని ఉపసంహరించుకోవాలని ముఖ్యమంత్రి జగన్​కు విజ్ఞప్తి చేశారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.