విశాఖ గీతం విశ్వ విద్యాలయం నిబంధనలు ఉల్లంఘించిందంటూ కేంద్రానికి వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) ఛైర్మన్, కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోక్రియాల్‌కు గురువారం లేఖ రాశారు.
యూజీసీ నిబంధనలను గీతం వర్సిటీ అతిక్రమించిందని లేఖలో ఎంపీ ఆరోపించారు. నిబంధనలు ఉల్లంఘించినందున వర్సిటీ హోదా ఉపసంహరించాలని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ భూములను గీతం విశ్వ విద్యాలయం ఆక్రమించిందని ఆరోపించారు. వాస్తవాలు తెలుసుకునేందుకు సత్వరమే విచారణ జరపాలని కోరారు. పలు ఉల్లంఘనల దృష్ట్యా గీతం వర్సిటీకి నోటీసులు జారీ చేయాలని విజయసాయిరెడ్డి లేఖలో విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:
గీతం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సెంటర్‌పై విజయసాయిరెడ్డి ఫిర్యాదు