ETV Bharat / city

Minister kannababu: జగన్​పై బురద జల్లేందుకే.. చంద్రబాబు దిల్లీ పర్యటన..! - ycp minister kannababu fires on tdp

తెదేపా చేపట్టిన 36 గంటల దీక్షలో.. పార్టీ నేతల చేత ఏపీ సీఎం జగన్‌ను తిట్టించారని ఆ రాష్ట్ర మంత్రి కన్నబాబు మండిపడ్డారు. ఏపీలో తెదేపా అశాంతి సృష్టించాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిపై బురద జల్లేందుకే చంద్రబాబు దిల్లీ పర్యటన అని ఆరోపించారు.

Minister kannababu
Minister kannababu
author img

By

Published : Oct 23, 2021, 4:12 PM IST

ఏపీలో అలజడి, అశాంతి సృష్టించాలని తెదేపా(TDP) ప్రయత్నాలు చేస్తోందని ఆ రాష్ట్ర మంత్రి కన్నబాబు(minister kannababu) ఆరోపించారు. దీని వెనుక చంద్రబాబే ఉన్నారన్నారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడే అధికార ప్రతినిధి ద్వారా బూతులు మాట్లాడించారని మండిపడ్డారు. తెదేపా అధినేత 36 గంటల దీక్షలో అందరిచేత సీఎం జగన్​(CM JAGAN)ను తిట్టించారని ధ్వజమెత్తారు. చంద్రబాబు(CHANDRABABU) ఎందుకు దీక్ష చేశారో.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికే తెలియదని విమర్శించారు. బద్వేలు(BADVEL), తెలంగాణలోని హుజూరాబాద్​(HUZURABAD)లో పోటీ చేయని తెదేపా.. జాతీయ పార్టీ ఎలా అయ్యిందో ఎవరికీ తెలియదన్నారు.

స్థానిక ఎన్నికలను బహిష్కరించినట్లు చెప్పిన తెదేపా నేతలు దుగ్గిరాలలో ఎలా గెలిచారని ప్రశ్నించారు. కుప్పం స్థానిక సంస్థల ఎన్నికలో గెలిచి చూపితే ఆనందిస్తామన్నారు. అధికారంలోకి వస్తే.. మొదటి ఆరు నెలలు వైకాపా నేతల అంతు చూస్తామని చెబుతున్న తెదేపాది.. పరిపాలన కోసం ఆరాటం కాదా అని ప్రశ్నించారు.

వైకాపా కార్యకర్తలపై చేయి పడితే సీఎం జగన్ చూస్తూ ఊరుకుంటారా అని కన్నబాబు ప్రశ్నించారు. సీఎంను తిట్టిన పదంతో.. రాష్ట్రపతి, ప్రధానిని సంభోదించగలరా అని ధ్వజమెత్తారు. తెదేపా పార్టీ కార్యాలయం దేవాలయం అయితే.. ఆ పార్టీ దేవుడు ఎన్టీఆర్​పైనే రాళ్లు వేయించిన ఘనత చంద్రబాబుదేనని ఎద్దేవా చేశారు. జగన్​పై బురద జల్లేందుకే.. చంద్రబాబు దిల్లీ పర్యటన అని విమర్శించారు. సంక్షేమ పథకాలను అడ్డుకునే ఉగ్రవాదం తెదేపా చేస్తోందని ఆయన ఆరోపించారు.

సంక్షేమ పథకాలు చూసి.. ప్రతిపక్షాలు ఓర్వటం లేదు

ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎవరినైనా.. చట్టపరంగా జైలుకు పంపుతామని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు.. ఆ పార్టీ నేత మాట్లాడిన బూతులను సమర్ధిస్తూ 36 గంటల దీక్ష చేయడం సిగ్గుచేటని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు దీన్ని గమనిస్తున్నారని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నడుచుకోవాలని మంత్రి ముత్తంశెట్టి హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు చూసి.. ఓర్వలేని ప్రతిపక్షానికి ఇక నూకలు చెల్లాయని అన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం పరిధిలోని గురుద్వారా కూడలిలో.. 48 గంటలపాటు నిర్వహించిన జనాగ్రహ దీక్షలో పాల్గొన్న వైకాపా నాయకుడు కె.కె. రాజుకు.. మంత్రి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.

ఇదీ చదవండి: TDP DELHI TOUR: ముఖ్యనేతలతో చంద్రబాబు భేటీ... సోమవారం రాష్ట్రపతిని కలవనున్న బృందం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.