ETV Bharat / city

'మహిళల డబుల్స్​కు తగినంత ఆదరణ దక్కట్లేదు' - సిక్కిరెడ్డి, అశ్విని పొన్నప్పల తాజా వార్తలు

బ్యాడ్మింటన్​ మహిళల డబుల్స్​కు తగినంత ఆదరణ దక్కట్లేదని ప్రముఖ అగ్రశ్రేణి డబుల్స్​ షట్లర్లు సిక్కిరెడ్డి, అశ్విని పొప్పన్న అభిప్రాయపడ్డారు. సికింద్రాబాద్​లోని రైల్వే స్టేడియంలో జరిగిన డబుల్స్​ టోర్నీ ఫైనల్​ పోటీలకు వీరు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

Women's doubles are not popular enough
మహిళల డబుల్స్​కు తగినంత ఆదరణ దక్కట్లేదు
author img

By

Published : Dec 9, 2019, 2:42 PM IST

దేశంలో బ్యాడ్మింటన్ మహిళల డబుల్స్​కు తగినంత ఆదరణ దక్కట్లేదని... ఆ విధానంలో మార్పు రావాలని ప్రముఖ బ్యాడ్మింటన్ అగ్రశ్రేణి షట్లర్లు సిక్కిరెడ్డి, అశ్విని పొన్నప్ప అభిప్రాయపడ్డారు. సికింద్రాబాద్​లోని రైల్వే స్టేడియంలో రెడ్​బుల్ షటిల్​ అప్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన​ మహిళల డబుల్స్​ టోర్నీ ఫైనల్​ పోటీలకు వీరు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

రెడ్​బుల్ షటిల్ మహిళా డబుల్స్ టోర్నీ యువ క్రీడాకారిణిలకు మంచి వేదిక అని సిక్కిరెడ్డి పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా భారత మహిళల డబుల్స్ బాధ్యతలు నిర్వర్తిస్తుండటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తమను స్ఫూర్తిగా తీసుకొని చాలా మంది మహిళలు డబుల్స్ టోర్నీ వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బ్యాడ్మింటన్​ డబుల్స్ మహిళలతో నిర్వహించడం ఆనందంగా ఉందని అశ్విని పొన్నప్ప పేర్కొన్నారు. సింగిల్స్, డబుల్స్ అనే తేడా లేకుండా ప్రతిభావంతులైన షట్లర్లను ఒకే విధంగా చూడాలని...అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని ఆమె తెలిపారు.

మహిళల డబుల్స్​కు తగినంత ఆదరణ దక్కట్లేదు

ఇదీ చూడండి: ఘనంగా షట్లర్​ సాయిప్రణీత్‌ వివాహం...

Intro:సికింద్రాబాద్ యాంకర్ ..దేశంలో బ్యాడ్మింటన్ మహిళల డబుల్స్లో తగినంత ఆదరణ దక్కట్లేదని ఆ విధానంలో మార్పు రావాలని ప్రముఖ బ్యాడ్మింటన్ అగ్రశ్రేణి షట్లర్లు సిక్కిరెడ్డి ,అశ్విని పొన్నప్ప అభిప్రాయపడ్డారు..రెడ్ బుల్ షటిల్ మహిళా డబుల్స్ టోర్నీ యువ క్రీడాకారిణులకు మంచి వేదిక అని చెప్పారు ..సికింద్రాబాదులోని రైల్వే స్టేడియంలో జరిగిన రెడ్ బుల్ షటిల్ అప్ డబుల్స్ టోర్నీలో జాతీయ ఫైనల్ పోటీలు జరిగాయి..భారత బ్యాడ్మింటన్ ప్రముఖ క్రీడాకారిణి సిక్కి రెడ్డి మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా భారత మహిళల డబుల్స్ బాధ్యతలు చేపట్టి నిర్వర్తిస్తుండటం ఎంతో సంతోషం గా ఉందని అన్నారు..తన సహచర క్రీడాకారిణి అశ్విని తో విజయాలు సాధించారని అన్నారు..తమను స్ఫూర్తిగా తీసుకొని చాలా మందు మహిళలు డబుల్స్ టోర్నీ వైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు..కాని వారికి మహిళల డబుల్స్ లో సరైన అవకాశాలు అందట్లేదు అని ఆమె అన్నారు..సింగిల్ పురుషుల డబుల్స్ కోన్నత ప్రాధాన్యత మహిళల డబుల్స్ కు లేదని అన్నారు..ఆ విధానంలో మార్పు రావాలని ప్రతిభ ఉన్నా కూడా సరైన మార్గనిర్దేశం లేక చాలా మంది వెనుకడుగు వేస్తున్న పరిస్థితి ఏర్పడిందని అన్నారు..పురుషుల డబుల్స్ లో సాత్విక్ చిరాకుల జోడి అద్భుతంగా ఆడుతుందని అన్నారు..వచ్చే ఏడాది ఒలంపిక్స్ నేపథ్యంలో ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నట్లు వెల్లడించారు..దిశ సంఘటనలో సరైన న్యాయం జరిగిందని అన్నారు...అశ్విని పొన్నప్ప మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో డబుల్స్ మహిళతో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు..సింగిల్స్ డబుల్స్ అనే తేడా లేకుండా ప్రతిభావంతులైన షట్లర్లను ఒకే విధంగా చూడాలని అన్నారు..అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని అన్నారు ..ఇటీవల దక్షిణ ఆసియా క్రీడలు బ్యాడ్మింటన్ లో మన యువ షట్లర్లు ప్రతిభ కనపరిచారు అని అన్నారు.. ఒలంపిక్ అర్హత ప్రక్రియ కొనసాగుతోందని మెగా క్రీడలలో ప్రాతినిధ్యం వహించే దిశగా సాగుతున్నట్టు ఆమె వెల్లడించారు ..
బైట్ ..సిక్కి రెడ్డి..జాతీయ డబుల్స్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి
బైట్..అశ్విని పొన్నప్ప జాతీయ డబుల్స్ క్రీడాకారిణి Body:VamshiConclusion:7032401099

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.