ETV Bharat / city

ప్రలోభాలు, ఒత్తిళ్లు: చివరి నిమిషం వరకూ ఆగని ఉపసంహరణల పర్వం

author img

By

Published : Mar 4, 2021, 10:05 AM IST

ఏపీలో పురపాలక ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజైన బుధవారం సైతం బెదిరింపుల పర్వం కొనసాగింది. ప్రత్యర్థుల బెదిరింపులకు భయపడి కొన్నిచోట్ల తెదేపా అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. తమ అభ్యర్థులను కాపాడుకునేందుకు తెదేపా నాయకులు అనేక ప్రయత్నాలు చేశారు. వారిని రహస్య ప్రదేశాలకు పంపించి.. గడువు ముగిశాకే స్వస్థలాలకు తీసుకొచ్చారు. అయినా కొన్నిచోట్ల చివరి నిమిషంలో అభ్యర్థులు నామినేషన్లు వెనక్కి తీసుకోవడంతో.. డమ్మీ అభ్యర్థులుగా, తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలో ఉన్నవారికి బి-ఫారాలు ఇచ్చారు. ఈ బెదిరింపులు తెదేపాకే పరిమితం కాలేదు. జనసేన, భాజపా, వామపక్ష పార్టీల అభ్యర్థులకూ ఎదురయ్యాయి.

withdrawal-of-nomination-processes-expiried-in-muncipal-elections-2021
ప్రలోభాలు, ఒత్తిళ్లు: చివరి నిమిషం వరకూ ఆగని ఉపసంహరణల పర్వం

బెదిరింపులు.. ప్రలోభాలు.. ఒత్తిళ్లు.. చివరి క్షణం వరకూ కొనసాగాయి. ఆంధ్రప్రదేశ్​లో మున్సిపల్‌ పోరును ఏకగ్రీవాల వైపు నడిపించేందుకు నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువైన బుధవారం సాయంత్రం వరకూ విశ్వప్రయత్నాలు జరిగాయి. కొన్నిచోట్ల విపక్ష అభ్యర్థుల సంతకాల్ని ఫోర్జరీ చేసి నామినేషన్లు ఉపసంహరించినట్టు ఆరోపణలున్నాయి. గుంటూరు జిల్లా మాచర్ల, పిడుగురాళ్ల మున్సిపాలిటీలను వైకాపా ఏకగ్రీవంగా గెలుచుకుంది. మాచర్లలో గత ఏడాది నామినేషన్ల సందర్భంగా విపక్ష అభ్యర్థుల్ని, స్వతంత్రుల్ని రాజకీయ ప్రత్యర్థులు అడ్డుకుని, నామినేషన్లు వేయనివ్వలేదని ఆరోపణలు వచ్చాయి. మాచర్లలో మళ్లీ నామినేషన్లకు అవకాశం ఇవ్వాలని తెదేపా కోరినా ఎన్నికల సంఘం అనుమతించలేదు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరులోనూ అన్ని స్థానాలూ వైకాపా ఏకగ్రీవం చేసుకుంది. ప్రత్యర్థుల బెదిరింపుల వల్లే తమ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారని తెదేపా ఆరోపించింది.

గడువు ముగిశాకా రుబాబు
కడప జిల్లా మైదుకూరులో ఉపసంహరణ సమయం ముగిసిన తర్వాత.. ఒకటో వార్డులో పోటీచేస్తున్న తెదేపా అభ్యర్థి వెంకటలక్ష్మమ్మ, స్వతంత్ర అభ్యర్థి విజయలక్ష్మి నామినేషన్‌ ఉపసంహరించుకునేందుకు ప్రధాన ద్వారం నుంచి కాకుండా, వేరే మార్గంలో కార్యాలయంలోకి వెళ్లారు. దీనిపై తెదేపా ఛైర్మన్‌ అభ్యర్థి ధనపాల జగన్‌ తీవ్ర అభ్యంతరం తెలిపారు. వారి నుంచి నామినేషన్‌ ఉపసంహరణ పత్రాలు తీసుకోవడానికి అధికారులు నిరాకరించడంతో వివాదం సద్దుమణిగింది.
్య కృష్ణాజిల్లా తిరువూరు 9వ వార్డులో తమ అభ్యర్థి భూక్యా మంగపై ప్రత్యర్థులు ఒత్తిడి తెచ్చి నామినేషన్లు ఉపసంహరింపజేశారని తెదేపా ఆరోపించింది. అక్కడ భాజపా అభ్యర్థి నాగేశ్వరరావుతోనూ నామినేషన్‌ ఉపసంహరింపజేసి, ఏకగ్రీవానికి ప్రయత్నించారు. అప్పటికే సమయం ముగియడంతో... భాజపా అభ్యర్థిని దొడ్డిదారిన గోడ దూకించి కార్యాలయంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా, తెదేపా నాయకులు అడ్డుకున్నారు. సీఐ వచ్చాక.. ఆయన పక్క నుంచే భాజపా అభ్యర్థిని కార్యాలయంలోకి పంపించారు. ఆగ్రహించిన తెదేపా నాయకులు ధర్నాకు దిగారు. తుదకు ఉపసంహరణ పత్రాన్ని తీసుకోవడానికి అధికారులు నిరాకరించారు.

ప్రలోభాలతో ఉపసంహరణలు
* విశాఖ నగరపాలక సంస్థ నాలుగో వార్డులో తెదేపా అభ్యర్థి గరికిన చినఎల్లయ్య పోటీనుంచి వైదొలిగారు. ఎల్లయ్యకు చేపల బోట్లు, ఇతర వ్యాపారాలు ఉన్నాయి. వాటిని దెబ్బతీస్తామని బెదిరించడం వల్లే ఉపసంహరించుకున్నారని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. అక్కడ తెదేపా తరఫున నామినేషన్‌ వేసిన మరో అభ్యర్థి నర్సింగరావుకు పార్టీ బి-ఫారం ఇచ్చింది.
* శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీలోని ఒక వార్డులో తెదేపా అభ్యర్థి నామినేషన్‌ ఉపసంహరించుకున్నట్టు అధికారులు ప్రకటించారు. అభ్యర్థి అక్కడికి రాకుండానే ఉపసంహరించుకున్నట్టు ఎలా ప్రకటిస్తారని తెదేపా నేతలు నిలదీశారు. చివరకు వైకాపా నాయకులు అమెను వెంటబెట్టుకుని అక్కడికి వచ్చి, పోటీ నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటింపజేశారు.
* తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో ఒక తెదేపా అభ్యర్థి, ఒక భాజపా అభ్యర్థి నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. పెద్దాపురంలో ఒకరు, సామర్లకోటలో మరొకరు తెదేపా అభ్యర్థులు పోటీనుంచి వైదొలిగారు. బెదిరింపులే కారణమని తెదేపా ఆరోపిస్తుంది.
* కర్నూలు జిల్లా ఆత్మకూరులో 24 వార్డులకు 15 ఏకగ్రీవమయ్యాయి. ఇందులో 14 వార్డులను వైకాపా, ఒక వార్డును స్వతంత్ర అభ్యర్థి కైవసం చేసుకున్నారు. తొమ్మిది వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. వాటిలోనూ మూడుచోట్లే తెదేపా అభ్యర్థులు బరిలో ఉన్నారు. తొలిరోజు ఉపసంహరించుకున్నవారికి రూ.2 లక్షలు, చివరి గంట వరకు వెనక్కి తగ్గనివారికి రూ. 6-8 లక్షల వరకూ ప్రత్యర్థులు ఎరచూపారని ఆరోపణ.
* ఒంగోలు తొమ్మిదో డివిజన్‌లో తెదేపా అభ్యర్థి నామినేషన్‌ ఉపసంహరించుకున్నారు. ఆయన వ్యాపారాలు దెబ్బతీస్తామని ప్రత్యర్థులు ఆరోపించడం వల్లే వెనక్కి తగ్గారని తెదేపా నేతలు ఆరోపించారు. అక్కడ స్వతంత్ర అభ్యర్థికి తెదేపా మద్దతు ప్రకటించింది. చీరాలలో 33 వార్డులుండగా అధికార పార్టీ నుంచి ఎమ్మెల్యే కరణం బలరామ కృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ వర్గాలు పోటీపడి 230కి పైగా నామినేషన్లు దాఖలు చేశాయి. కరణం వర్గానికే మెజారిటీ బీఫాంలు అందాయి. ఇక్కడ 81 మంది స్వతంత్రులు బరిలో నిలిచారు. తెదేపా తరఫున నామినేషన్లు దాఖలుచేసిన అభ్యర్థులను నాయకులు మంగళవారం రాత్రి హైదరాబాద్‌ తరలించారు. ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన తర్వాత తీసుకొచ్చారు. మార్కాపురంలో అధికార పార్టీ అరాచకాలకు నిరసనగా ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు తెదేపా నాయకులు మంగళవారమే ప్రకటించారు. కానీ అధిష్ఠానం ఆదేశాల మేరకు అభ్యర్థులు చివరికి బరిలో నిలిచారు. అద్దంకి 8వ వార్డులో నాటకీయ పరిణామాల మధ్య తెదేపా, వైకాపా అభ్యర్థులిద్దరూ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. అక్కడ ఎన్నిక నిలిచిపోయింది.
* నెల్లూరు జిల్లా నాయుడుపేటలో 23 చోట్ల ఒకే నామినేషన్‌ దాఖలైంది.
* అనంతపురంలో తెదేపా తరఫున నామినేషన్‌ వేసిన ఇద్దరు వైకాపాలో చేరారు. అక్కడ తెదేపా తరఫున డమ్మీలుగా నామినేషన్‌ వేసిన వారే అభ్యర్థులయ్యారు.

అభ్యర్థి సంతకం ఫోర్జరీ చేసి..
తిరుపతిలో ఏడో వార్డు నుంచి తెదేపా అభ్యర్థిగా పోటీచేస్తున్న విజయలక్ష్మి నామినేషన్‌ ఉపసంహరణ ఆమెకు తెలియకుండానే జరిగిపోయింది. తన సంతకం ఫోర్జరీ చేసి నామినేషన్‌ ఉపసంహరణ పత్రం అందజేశారని ఆమె ఆరోపించారు. తాను లేకుండా నామినేషన్‌ ఉపసంహరించుకున్నట్టు ఎలా ప్రకటిస్తారని ఆమె, భర్త మధుతో కలసి రిటర్నింగ్‌ అధికారి వద్దకు వెళ్లి నిలదీశారు. ‘అన్యాయం చేస్తే ఆత్మహత్య చేసుకుంటా. మీతోపాటు మీ కుటుంబసభ్యులూ బాధపడాల్సి వస్తుంది’ అని రిటర్నింగ్‌ అధికారిని మధు హెచ్చరించారు. అంతకుముందే ఆర్వోకు ఫోన్‌ చేశానని, తన నామినేషన్‌ అక్రమంగా ఉపసంహరింపజేసే అవకాశముందని, తన ప్రమేయం లేకుండా ఏ నిర్ణయం తీసుకోవద్దని కోరానని విజయలక్ష్మి తెలిపారు. ఫోన్‌ సంభాషణను రికార్డు చేసినట్టూ చెప్పారు. ఆర్వో కుట్రపూరితంగా తనను పోటీ నుంచి తప్పించారని, తన సంతకాన్ని ఆయనే ఫోర్జరీ చేశారని ఆమె బుధవారం సాయంత్రం తిరుపతి తూర్పు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తిరుపతిలోనే 26వ డివిజన్‌లో భాజపా తరఫున పోటీచేస్తున్న మునికృష్ణయాదవ్‌ నామినేషన్‌ను.. ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసి, ప్రతిపాదకుడు సుబ్రమణ్యంరెడ్డి ద్వారా ఉపసంహరింపజేసేందుకు ప్రయత్నించగా ఆ పార్టీ అధికార ప్రతినిధి చామంచి శ్రీనివాస్‌ కార్యకర్తలతో కలసి అడ్డుకున్నారు.

గత ఏడాది సంతకాలు తీసుకుని..
గుంటూరు జిల్లా సత్తెనపల్లి, వినుకొండ మున్సిపాలిటీల్లో పోటీనుంచి వైదొలగాలని తెదేపా, జనసేన అభ్యర్థులకు బెదిరింపులు వచ్చాయి. సత్తెనపల్లిలోని ఆరోవార్డులో తెదేపా, 25వ వార్డులో జనసేన అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. దానిపై వారిద్దరూ అభ్యంతరం తెలియజేశారు. గత ఏడాది నామినేషన్లు వేసినప్పుడే తమతో బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని, ఇప్పుడు నామినేషన్‌ ఉపసంహరించుకున్నట్టు చెబుతున్నారని వాపోయారు. దీనిపై స్థానిక తెదేపా నాయకుడు శివనాగ మల్లేశ్వరరావు, వెంకట సాంబశివరావు తదితరులు లక్కరాజుగార్లపాడు బస్టాండ్‌ కూడలిలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

రాత్రి 8 వరకూ మంతనాలు
ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి నియోజకవర్గంలోని డోన్‌ మున్సిపాలిటీలో 32 వార్డులకు 25 ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. మిగతా ఏడింటినీ ఏకగ్రీవం చేసేందుకు బుధవారం రాత్రి 8 వరకూ మంతనాలు సాగించారు. మధ్యాహ్నం 3.30 తర్వాత కొందరికి టోకెన్లు ఇచ్చామని రాత్రి వరకూ ఏకగ్రీవాలకు ప్రయత్నాలు చేశారు. ఆ ఏడుగురూ తనతోనే ఉన్నారని ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్‌ కర్నూలులో విలేకర్లకు తెలిపారు. ఫోర్జరీ సంతకాలతో వారిని తప్పించేందుకు మంత్రి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నాలుగు చోట్లే తెదేపా అభ్యర్థులు పోటీలో ఉన్నారని, మిగతా మూడుచోట్లా ఉపసంహరించుకున్నారని అధికారులు ప్రకటించారు.

ఇదీ చదవండి: రేళ్లలో పన్నెండు కోట్ల ఉద్యోగాలు ఇచ్చారా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.