ఏపీ ముఖ్యమంత్రి జగన్‌పై నమోదైన కేసు ఉపసంహరణకు హైదరాబాద్లోని ప్రజాప్రతినిధుల కోర్టు అనుమతిచ్చింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు ఉపసంహరణకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చింది. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారని 2014లో జగన్‌పై కేసు నమోదైంది. కోదాడ పోలీసులు పెట్టిన కేసు ఉపసంహరణకు కోర్టు అనుమతి మంజూరు చేసింది. జగన్‌పై ఛార్జిషీట్ ఇటీవల ప్రజాప్రతినిధుల కోర్టుకు బదిలీ అయ్యింది.
ఆయనపై కేసు ఉపసంహరణకు అనుమతి ఇవ్వాలని పోలీసులు న్యాయస్థానాన్ని కోరారు. ఏ-2, ఏ-3పై కోదాడ కోర్టు కేసు కొట్టివేసిందని తెలిపారు. 2014లో ఫిర్యాదు చేసిన ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి వాంగ్మూలం నమోదు చేశారు. ప్రభుత్వం నిర్ణయించినందున ఉపసంహరణకు అభ్యంతరం లేదని ఎంపీడీవో చెప్పారు. ఈ మేరకు.. జగన్‌పై ప్రాసిక్యూషన్ ఉపసంహరణకు ప్రజాప్రతినిధుల కోర్టు అనుమతి ఇచ్చింది.
ఇదీ చదవండి: బోయిన్‌పల్లి అపహరణ కేసులో 14 మందికి బెయిల్