ETV Bharat / city

TSRTC employees Retirement : పదవీ విరమణ సమయం ఆసన్నమైనట్టేనా..? - తెలంగాణ ​ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ

TSRTC employees Retirement : తెలంగాణ సర్కార్ ఆర్టీసీ ఉద్యోగులకు పెంచిన రెండేళ్ల పదవీ విరమణ గడువు ఈ నెలాఖరుతో పూర్తి కానుంది. పదవీ విరమణలు మొదలవుతాయా లేక మరో ఏడాది గడువు పొడిగిస్తారా అనేవే ప్రస్తుతం రాష్ట్ర ఆర్టీసీలో చర్చనీయాంశాలవుతున్నాయి. మరో ఏడాది గడువు పొడిగించాలని అధికారులు ప్రభుత్వానికి దస్త్రం పంపారు. ఈ క్రమంలో సర్కార్ నిర్ణయమేంటనేది ఆసక్తిగా మారింది.

TSRTC employees Retirement
TSRTC employees Retirement
author img

By

Published : Dec 27, 2021, 8:33 AM IST

TSRTC employees Retirement : ఉద్యోగుల పదవీ విరమణలు మొదలవుతాయా? మరో ఏడాది అవకాశం లభిస్తుందా? రాష్ట్ర ఆర్టీసీలో ప్రస్తుతం ఇవే చర్చనీయాంశాలుగా ఉన్నాయి. ఉద్యోగులకు మరో ఏడాది గడువు పెంచేందుకు వీలుగా అధికారులు ప్రభుత్వానికి దస్త్రాన్ని పంపారు. కానీ ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. పెంపుదలపై కొందరు కండక్టర్లు, డ్రైవర్లు నిరాసక్తంగా ఉండగా అధికారులు, పరిపాలనా ఉద్యోగులు ఆసక్తితో ఉన్నట్లు సమాచారం.

58 నుంచి 60 ఏళ్లకు పెంపు..

Telangana RTC employees Retirement : ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 60 ఏళ్లకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2019 డిసెంబరులో పెంచారు. దాంతో రెండేళ్లుగా ఆర్టీసీలో పదవీ విరమణలు నిలిచిపోయాయి. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును ప్రభుత్వం 61 ఏళ్లకు పెంచింది. ఒకపక్క అప్పులు, మరోవైపు నష్టాలతో ఆర్టీసీ ఆర్థికంగా కుదేలయింది. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు చెల్లించాల్సిన మొత్తాలను గడిచిన కొన్నేళ్లుగా చెల్లించలేని స్థితి ఉంది. 2019 మార్చిలో రిటైర్‌ అయిన వారికి మాత్రమే సెలవులు, చివరి నెల జీతం తదితరాలను చెల్లించింది. ఆ తర్వాత పదవీ విరమణ చేసిన వారికి చెల్లించాల్సి ఉంది. ఆ మొత్తం సుమారు రూ.100 కోట్లకుపైగా ఉంటుందన్నది అంచనా.

ఏటేటా భారీగా విరమణలు

TSRTC employees Retirement Latest : 2019లో ఆర్టీసీపై కార్మికులతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్వహించిన సమావేశంలో ఆ సంవత్సరం నుంచి ఏటా ఎంతమంది పదవీ విరమణ చేస్తారన్న వివరాలతో నివేదికను అందజేశారు. ఆ గణాంకాల ప్రకారం 2019లో 659 మంది, 2020లో 2,615, 2021లో 4,690 మంది పదవీవిరమణ చేయాల్సి ఉంది. రెండేళ్లలో పదవీ విరమణలు లేకపోవటంతో డిసెంబరు నాటికి ఆ సంఖ్య 7,964కి చేరుతుంది. ఆ తర్వాతా ఏటేటా భారీ సంఖ్యలోనే విరమణలు ఉండనున్నాయి. ఎంతమంది ఉద్యోగులు పదవీ విరమణ చేసినా వారికి పూర్తి స్థాయిలో చెల్లించలేని పరిస్థితిలో ఆర్టీసీ ఉంది.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.