ETV Bharat / city

అనవసరంగా రోడ్డుమీదకొస్తే వాహనాలు సీజ్

లాక్​డౌన్​ అమలుకు రవాణాశాఖ అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారికి అవగాహన కల్పిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 330 వాహనాలు సీజ్​ చేసినట్టు అధికారులు వెల్లడించారు.

who come out without reason their vehicles seized by rta officers
అనవసరంగా రోడ్డుమీదకొస్తే వాహనాలు సీజ్
author img

By

Published : Mar 24, 2020, 11:22 PM IST

రాష్ట్రంలో లాక్​డౌన్​ విజయవంతం చేసేందుకు రవాణాశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. రోడ్ల మీద ఇష్టానుసారంగా తిరుగుతున్న వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారి వాహనాలు సీజ్​ చేస్తున్నారు. అత్యవసర విధులు నిర్వర్తించే వారికి సంబంధించినవి తప్ప మిగతా ఏ వాహనాలు వచ్చినా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరిస్తున్నారు.

లాక్​డౌన్​ అమలైన మొదటి రోజున రాష్ట్రవ్యాప్తంగా 300 వాహనాలు సీజ్​ చేసినట్టు అధికారులు తెలిపారు. నిన్నటితో పోల్చితే ఈ రోజు వాహనాల సీజ్​ తగ్గినట్టు వివరించారు. ఇవాళ కేవలం 30 వాహనాలపై మాత్రమే చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు. ఇప్పటికైనా మేల్కొని ఇంటి వద్దనే ఉండాలని​ సంయుక్త రవాణాశాఖ అధికారి పాపారావు విజ్ఞప్తి చేశారు.

అనవసరంగా రోడ్డుమీదకొస్తే వాహనాలు సీజ్

ఇదీ చూడండి: '21 రోజుల నిర్బంధం... ప్రాణాలకన్నా ఎక్కువేం కాదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.