రాష్ట్రంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ రెండు రోజుల పాటు పర్యటించనున్న నేపథ్యంలో.. భాగ్యనగరంలో కొన్ని ప్రాంతాల్లో వెలిసిన ప్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. ట్యాంక్‌బండ్, గన్పార్స్ వద్ద వెలిసిన ఈ ఫ్లెక్సీల్లో.. "రాహుల్ గాంధీ.. వైట్ ఛాలెంజ్‌కు సిద్ధమా..?" అని ఉండటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. రాహుల్ రెండు రోజుల పర్యటనలో నేపథ్యంలో ఓయూలో ముఖాముఖికి అనుమతి నిరాకరణ చర్చకు దారి తీయగా.. ప్రస్తుతం వెలిసిన ఫ్లెక్సీలు కలకలం సృష్టిస్తున్నాయి.
గతంలో ఈ "వైట్ ఛాలెంజ్" రాష్ట్రంలో పెద్ద దుమారమే రేపింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసు సమయంలో తెర మీదికి వచ్చిన ఈ వైట్ ఛాలెంజ్.. హైదరాబాద్ సింగరేణి కాలనీలో జరిగిన ఘటనతో రాజకీయ రంగు పులుముకుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, తెరాస పార్టీల నాయకులు ఒకరికొకరు సవాళ్లు విసురుకున్నారు. డ్రగ్స్ కేసు నుంచి పలువురు నిందితులను తప్పించేందుకు తెరాస నేతలు ప్రయత్నిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. అదే క్రమంలో.. సదరు నాయకులు కూడా డ్రగ్స్ తీసుకున్నారంటూ.. కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఒకవేళ తప్పు చేయలేదని నిరూపించుకోవాలంటే.. నార్కొటిక్ టెస్ట్ చేయించుకోవాలని సవాల్ విసిరారు. ఇలా వైట్ ఛాలెంట్ చర్చనీయాంశమైంది.
మొదట మంత్రి కేటీఆర్‌తో పాటు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి రేవంత్‌రెడ్డి వైట్ ఛాలెంజ్ విసిరారు. ధీటుగా స్పందించిన కేటీఆర్.. తాను ఏ పరీక్షకైనా సిద్ధమేనని.. అందుకోసం దిల్లీ ఎయిమ్స్‌కు వస్తానని తెలిపారు. అయితే.. ఈ ఛాలెంజ్‌లో రాహుల్ గాంధీ కూడా ఉంటేనే తాను వస్తానని మెలిక పెట్టారు. ఇలా ఈ వైట్ ఛాలెంజ్‌లోకి.. రాహుల్‌గాంధీ పేరు వచ్చింది. అది కాస్తా.. ప్రస్తుతం రాహుల్ పర్యటన నేపథ్యంలో ఏకంగా ఫ్లెక్సీల రూపంలో ప్రత్యక్షమవటం ఆసక్తికరంగా మారింది.
ఇవీ చూడండి: