ETV Bharat / city

తీవ్ర ఆందోళనలో ఆశల అమరావతి?

మొన్నటి వరకూ అది కోటి ఆశల కలల తీరం..! అభివృద్ధికి చిరునామా... ఆధునిక గ్రోత్‌కారిడార్‌! కానీ ఇప్పుడు అదే ప్రాతం పెద్ద ప్రశ్నార్థకం. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి భవిష్యత్తులో అద్భుత నగరంగా అభివృద్ధి చెందుతుందన్న అంచనాలతో స్థిరాస్తి వ్యాపారులు, ప్రయివేటు వ్యక్తులు తాడేపల్లి-కాజ మధ్య రూ.కోట్లలో పెట్టుబడి పెట్టారు. మధ్యతరగతి వారు తాము జీవితాంతం సంపాదించిన సొమ్ముతో, అప్పులు తెచ్చి ఫ్లాట్లు కొనుక్కున్నారు. అలా పెట్టుబడి పెట్టిన నిర్మాణ సంస్థల యజమానులు, కొనుగోలు చేసిన వారు, హోటళ్లు, వివిధ వ్యాపారాలు ప్రారంభించిన వారంతా రాజధాని మార్పు వార్తల నేపథ్యంలో తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

what-is-the-fate-of-huge-buildings-in-amravati
తీవ్ర ఆందోళనలో ఆశల అమరావతి?
author img

By

Published : Jan 13, 2020, 7:03 AM IST

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నుంచి గుంటూరు వెళ్లే మార్గంలో... కనకదుర్గ వారధి దాటిన తర్వాత తాడేపల్లి నుంచి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వరకు జాతీయ రహదారి వెంట 12-15 కి.మీ.ల వరకు నాలుగున్నరేళ్లలో ఒక గ్రోత్‌ కారిడార్‌(అభివృద్ధి నడవా)లా మారింది. అమరావతి నగరం ప్రణాళికల దశలో ఉండగానే... ఇక్కడ ప్రగతి మొదలైంది. రాజధానికి అనుబంధంగా పూర్తిగా ప్రైవేటు పెట్టుబడులతో ఇదొక ‘అంకుర ప్రాంతం’గా అభివృద్ధి చెందుతోంది. జాతీయ రహదారికి అటూఇటూ కొన్ని వందల సంఖ్యలో అపార్ట్‌మెంట్లు నిర్మించారు. చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులు లెక్కకు మిక్కిలి వచ్చాయి.

నిర్మాణాలు సాగుతున్నాయి..

వేల సంఖ్యలో ఫ్లాట్‌లు, వందల సంఖ్యలో విల్లాలు, వేల చ.అడుగుల వాణిజ్య ప్రాంత(కమర్షియల్‌ ప్లేస్‌) నిర్మాణాలు సాగుతున్నాయి. భూముల ధరలు అమాంతం పెరిగాయి. అధికార పార్టీ వైకాపాతోపాటు ప్రధాన ప్రతిపక్షం తెదేపా, జనసేన పార్టీల కార్యాలయాలూ అక్కడే ఉన్నాయి. డీజీపీ ఆఫీసుతోపాటు పలు ప్రభుత్వ కార్యాలయాలూ కొలువుదీరాయి. ఐటీ కంపెనీలు, ఐదారు పెద్ద హోటళ్లు, రెస్టారెంట్‌లు అనేకం వచ్చాయి. జాగ్వార్‌ వంటి ఖరీదైన కార్ల షోరూంలూ వచ్చాయి. ఎలక్ట్రానిక్స్‌, గృహోపకరణాలు, నిత్యావసర వస్తువులు గృహ నిర్మాణ సామగ్రిని విక్రయించే దుకాణాలూ ఏర్పాటవుతున్నాయి.

ప్రగతి ఎంతంటే
మొత్తం పరిధి: 12-15 కి.మీ
ప్రాజెక్టులు: వందల సంఖ్యలో పెద్ద సంస్థలు: 15
పెట్టుబడి అంచనా: 8-10 వేల కోట్లు
ఐటీ కంపెనీలు: 40
ఫ్లాట్లు: సుమారు 11 వేలు

బ్రాండ్‌ ఇమేజ్‌... తెచ్చిందిక్కడికి!

  • అమరావతికి వచ్చిన బ్రాండ్‌ ఇమేజ్‌ కారణంగా రాజధాని ప్రాజెక్టు ప్రణాళికలు, డిజైన్ల రూపకల్పన దశలో ఉండగానే ఇక్కడి అవకాశాలు అందిపుచ్చుకోవడానికి పెట్టుబడిదారులు పోటీ పడ్డారు.
  • 6 వరుసల జాతీయ రహదారి, దానికి అటూఇటూ రెండు లేన్ల సర్వీసు రోడ్లు అంటే మొత్తం 10 లేన్లు ఉన్నాయి. వీటి పక్కనే భూములు అందుబాటులో ఉండటం. నీటి లభ్యతా పుష్కలంగా ఉండటం ఆకర్షించింది.
  • విజయవాడ, గుంటూరు నగరాలు, తాడేపల్లి, మంగళగిరి పట్టణాలకు మధ్య ఉండటం ఆకట్టుకుంది.
  • రైలు, రోడ్డు మార్గాలకు అనుసంధానత మరో ముందడుగు.
  • ప్రవాసాంధ్రులు, ఐటీ సంస్థల్లో పనిచేస్తున్న వారితోపాటు ప్రభుత్వ ఉద్యోగులు ఇక్కడ ఫ్లాట్‌లు కొనడానికి ఆసక్తి చూపడంతో పెట్టుబడులు పెరిగాయి.

వేల మందికి ఉపాధి...!
గృహ నిర్మాణ ప్రాజెక్టుల నిర్మాణ వ్యయంలో (స్థలం ధర కాకుండా)... ప్రతి రూ.100లో 40 శాతం కార్మికులకు వేతనాల రూపంలో వెళుతుంది. ప్రభుత్వానికి పన్నుల రూపంలో 30 శాతం వెళుతుంది. సామగ్రి కొనుగోలుకి 30 శాతం వెచ్చిస్తారు. 500 ఫ్లాట్‌లు నిర్మించే భారీ ప్రాజెక్టులో కనీసం వెయ్యి మంది కార్మికులు, 100 మంది వరకు ఇతర సిబ్బంది పని చేస్తుంటారు. తాడేపల్లి-కాజ మధ్య నిర్మాణ ప్రాజెక్టుల పనులు ముమ్మరంగా జరుగుతున్న సమయంలో ప్రతిరోజూ కనీసం 10 వేల మందికి ఉపాధి లభించేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

పెట్టుబడుల ధామం... ప్రగతికి మార్గం

  • తెలుగు రాష్ట్రాల్లోని 15 ప్రముఖ నిర్మాణ సంస్థలు తాడేపల్లి-నాగార్జున యూనివర్సిటీ మధ్యలో జాతీయ రహదారికి అటూఇటూ పలు బహుళ అంతస్తుల గృహ నిర్మాణ, వాణిజ్య ప్రాజెక్టులు చేపట్టాయి. అన్నీ పూర్తయితే దాదాపు 11 వేల ఫ్లాట్ల వరకు ఉంటాయి. వాటిలో ఐదారు ప్రాజెక్టులు ఇప్పటికే దాదాపు పూర్తవగా, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి.
  • ప్రముఖ నిర్మాణ సంస్థలు 1000 వరకు విల్లాలు, వ్యక్తిగత గృహ నిర్మాణాలు చేపట్టాయి. చాలా వరకు నిర్మాణ దశలో ఉన్నాయి.
  • ఐటీ కంపెనీలు, కార్పొరేట్‌ వ్యాపార సంస్థల కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలకు అద్దెకిచ్చేందుకు పలు భవనాలు నిర్మించారు. కొన్ని పెద్ద ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇప్పటికే నిర్మించిన, నిర్మిస్తున్న, ప్రతిపాదిత వాణిజ్య స్థలాల్లో నిర్మితప్రాంతం 30 లక్షల చ.అడుగులకుపైగా ఉంటుంది.
  • 20 నుంచి 100 వరకు ఫ్లాట్‌లు కలిగిన అపార్ట్‌మెంట్‌లు కొత్తగా వందల సంఖ్యలో వచ్చాయి.
  • జాతీయ రహదారి పొడవునా భూముల విలువ గణనీయంగా పెరిగింది. హైవేకి ఎంత దూరంలో ఉన్నాయన్న దాన్ని బట్టి ఎకరం రూ.5 కోట్ల నుంచి రూ.17 కోట్ల వరకు ధర పలికింది.
  • పలు సంస్థలు రైతులతో అభివృద్ధి ఒప్పందాలు చేసుకున్నాయి. కొన్ని సంస్థలు అడ్వాన్సులు ఇచ్చాయి.
  • 500-600 ఫ్లాట్‌లతో చేపట్టే భారీ గృహ నిర్మాణ ప్రాజెక్టుల్లో పెట్టుబడి రూ.350 కోట్ల నుంచి రూ.450 కోట్ల వరకు ఉంటుందని స్థిరాస్తి పరిశ్రమ వర్గాల అంచనా.
  • వారధి నుంచి నాగార్జున యూనివర్సిటీ మధ్య జాతీయ రహదారి పక్కన ఉన్న ప్రాంతంలో చిన్నాపెద్దా కలిపి 40 వరకు ఐటీ కంపెనీలు వచ్చాయి.
  • ఈ ప్రాంతంలో గృహ, వాణిజ్య నిర్మాణ ప్రాజెక్టులు, హోటళ్లు, వ్యాపారాలు, భూముల కొనుగోళ్లలో వచ్చిన పెట్టుబడులు రూ.8-10 వేల కోట్ల వరకు ఉంటాయని అంచనా.

మంగళగిరి : ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి సమీపంలో జాతీయ రహదారి పక్కనే రూ.200 కోట్లతో చేపట్టిన 8 అంతస్తుల భవనం 80 శాతం పూర్తయింది. 4 లక్షల చ.అడుగుల నిర్మిత ప్రాంతం. ఐటీ కంపెనీలకు ఇవ్వడానికి చేపట్టిన ప్రాజెక్టు అది. భవన యజమాని గత ప్రభుత్వ హయాంలో డిజిగ్నేటెడ్‌ టెక్నాలజీ పార్క్‌(డీటీపీ) పాలసీ కింద ఐటీ శాఖతో ఒప్పందం చేసుకున్నారు. దాని ప్రకారం ఈ భవనంలోకి ప్రభుత్వమే ఐటీ కంపెనీలను తేవాలి. వాటికి రాయితీలు ఇవ్వాలి. ఇప్పుడా యజమానిలో కొండంత గుబులు మొదలైంది. అమరావతి నుంచి రాజధాని తరలిపోతే... తాను కడుతున్న భవనంలోకి ఎవరూ రారన్న ఆందోళన. బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చి చేపట్టిన ప్రాజెక్టు భవిష్యత్తేంటో తెలియని గందరగోళం నెలకొంది.!

కాజ : టోల్‌గేట్‌కి సమీపంలో ఒక నిర్మాణ సంస్థ 40 ఎకరాల్లో రూ.400 కోట్లతో భారీ ప్రాజెక్టు చేపట్టింది. వందల సంఖ్యలో విల్లాలు, ఫ్లాట్‌లు, ఐటీ కంపెనీల కోసం పలు అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు. మొత్తంగా 6లక్షల చ.అ.తో ఉన్న టెక్నోపార్క్‌, మల్టీప్లెక్స్‌, వాణిజ్య సముదాయమది. 20 శాతం పనులు పూర్తయ్యాయి. రాజధానిపై అనిశ్చితి నేపథ్యంలోనూ భారీ ప్రాజెక్టుని కొనసాగిస్తే, కొనేవాళ్లు వస్తారో, రారో తెలియక పనులను చాలావరకు నిలిపేశారు. కేవలం అపార్ట్‌మెంట్లను మాత్రమే అదీ నెమ్మదిగా నిర్మిస్తున్నారు.

నాగార్జున : యూనివర్సిటీ సమీపంలో గృహ, వాణిజ్య అవసరాలకు విక్రయించేందుకు మరో ప్రముఖ నిర్మాణ సంస్థ బహుళ అంతస్తుల టవర్లతో భారీ ప్రాజెక్టు చేపట్టింది. వేలాది ఫ్లాట్లు ఉన్నాయి. ఇందులో 8 లక్షల చ.అడుగుల నిర్మిత ప్రాంతంతో రెండు టవర్లను వాణిజ్య అవసరాలకు ప్రత్యేకించారు. బుకింగ్‌లు నిరాశాజనకంగా ఉన్నాయి. వాణిజ్య టవర్లు ఇప్పటి వరకు సగం పూర్తవగా మిగతా పనులను నిలిపేశారు.

నాడు భారీ అంచనా.. నేడు పునరాలోచన

  • ఓ పెద్ద నిర్మాణ సంస్థ యజమాని తాడేపల్లి వద్ద ఒక గృహ నిర్మాణ ప్రాజెక్టు చేపట్టారు. హైకోర్టు న్యాయవాదులు కొందరు దానిలో ఫ్లాట్‌లు బుక్‌ చేసుకున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనతో ఇప్పుడు వారంతా బుకింగ్‌లు రద్దు చేసుకుంటామని ఒత్తిడి తెస్తున్నారు. హైకోర్టును కర్నూలుకు తరలిస్తే ఇక్కడ మాకు ఫ్లాట్‌ ఉండీ ఏం ఉపయోగం అన్నది వారి ఆందోళన. అక్కడికి దగ్గర్లోనే విల్లాల నిర్మాణం చేపట్టేందుకు సిద్ధమైన ఆ నిర్మాణ సంస్థ యజమాని... తాజా పరిణామాలతో తన ప్రాజెక్టుని ప్రస్తుతానికి రద్దు చేసుకున్నారు.
  • కుంచనపల్లి సమీపంలో... ఓ నిర్మాణ సంస్థ 450 విల్లాల నిర్మాణానికి అంతా సిద్ధం చేసుకుంది. మరో సంస్థ 30 ఎకరాల్లో బహుళ అంతస్తుల నివాస గృహాల ప్రాజెక్టులు చేపట్టేందుకు సిద్ధమైంది. తాజా పరిణామాలతో ఆలోచన విరమించుకున్నాయి. 6 ఎకరాల్లో బెంగళూరుకి చెందిన ఒక సంస్థ అంతర్జాతీయ పాఠశాల నిర్మాణానికి సన్నాహాలు చేసుకుంది. భూమి యజమానితో ఒప్పందం చేసుకుని, అడ్వాన్స్‌ చెల్లించింది. ఇప్పుడు ప్రాజెక్టు రద్దు చేసుకుంది. భూ యజమానితో మాట్లాడి డబ్బు వెనక్కు తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది.
  • ఓ సంస్థ మూడున్నర ఎకరాల్లో ఐటీ కంపెనీల కోసం భారీ ప్రాజెక్టు చేపట్టేందుకు పూజా కార్యక్రమాలు నిర్వహించింది. ఇప్పుడు ఆలోచనలో పడింది.
  • ఇద్దరు యువకులు చెరో రూ.75 లక్షలు పెట్టి, తాడేపల్లి సమీపంలో ఒక డ్రైవ్‌ఇన్‌ రెస్టారెంట్‌ ప్రారంభించారు. మొదట్లో రోజుకి రూ.1.50 లక్షల వరకు విక్రయాలు జరిగేవి. ఇప్పుడు రోజుకి రూ.5 వేలను కళ్లజూస్తే గొప్ప.

మా పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. గృహ నిర్మాణ ప్రాజెక్టులు మాత్రం కొనసాగిస్తున్నాం. వాణిజ్య, ఐటీ పార్కు ప్రాజెక్టులు నిలిపివేశాం.
-భారీ ప్రాజెక్టు యజమాని
మా ప్రాజెక్టులో ఫ్లాట్‌ల వివరాలు, ధరలు వాకబు చేసేందుకు రెండు నెలల క్రితం వరకు రోజూ కనీసం ముగ్గురు, నలుగురు వచ్చేవారు. వారాంతాల్లో 10 మందికిపైగా వచ్చేవారు. ప్రతీ నెలా కనీసం 5-7 ఫ్లాట్‌లు విక్రయించేవాళ్లం.
-ఓ భారీ ప్రాజెక్టు సంస్థ యజమాని

ఎటు చూసినా అనిశ్చితి... ఆందోళన!
కొన్ని నెలల క్రితం వరకు నిర్మాణ కార్యక్రమాలతో కళకళలాడిన ఈ ప్రాంతంలో ప్రస్తుతం స్తబ్ధత నెలకొంది. భారీగా పెట్టుబడులు పెట్టి నిర్మాణాలు చేస్తున్నవారు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. రాజధాని పనులు నిలిపివేయడం, ఇక్కడే కొనసాగిస్తారా? లేదా? అన్న అనిశ్చితి నెలకొనడం, మంత్రులు తలోవిధంగా మాట్లాడటంతో... కొత్తగా పెట్టుబడులు పెట్టేవారెవరూ ముందుకి రావడంలేదు. ఫ్లాట్‌లు కొనుగోలు చేసేవారూ వేచిచూసే ధోరణిలో ఉండటంతో వ్యాపారం మందగించింది. మూడు రాజధానుల ప్రతిపాదనతో ఈ ప్రాంతంలో నిర్మాణరంగం తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది. భారీ పెట్టుబడులు పెట్టినవారంతా ఆందోళనలో ఉన్నారు.
50-60 శాతం
వారధి నుంచి కాజ వరకు నిర్మించిన బహుళ అంతస్తుల ప్రాజెక్టుల్లో నాలుగైదు సంస్థలు మాత్రమే ఈ మేరకు ఫ్లాట్‌లను విక్రయించాయి.
20-30 శాతం
మిగతా వాటిలో జరిగిన బుకింగ్‌లు ఇవీ

ఇదీ చూడండి : 'కేటీఆర్ ఆస్తులు 425 శాతం ఏలా పెరిగాయి'

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.