రాష్ట్రంలో ఆదివారం భారీ వర్షాలు... రేపు, ఎల్లుండి( సోమ, మంగళవారాల్లో) భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలోని తూర్పు, ఈశాన్య, ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని ఒకటి, రెండు ప్రదేశాల్లో ఈ ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. కొన్ని జిల్లాల్లో నేడు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
నిన్న ఛత్తీస్గఢ్ దాని పరిసర ప్రాంతాల నుంచి తెలంగాణా వరకు వ్యాపించి ఉన్న ఉత్తర - దక్షిణ ఉపరితల ద్రోణి ఈ రోజు బలహీన పడిందని అధికారులు పేర్కొన్నారు. ఈ రోజు ఉపరితల ఆవర్తనం పశ్చిమ మధ్య బంగాాఖాతంలోని దక్షిణ ఒడిశా తీరంలో సముద్ర మట్టానికి 3.1 కి.మీ. నుంచి 7.6 కి.మీ. ఎత్తు మధ్య కొనసాగుతూ నైరుతి దిశ వైపు వంపు తిరిగి ఉందని ఐఎండీ అధికారులు వివరించారు.
ఇదీ చూడండి:
'దేశం మనదే...తేజం మనదే...' గేయ రచయిత కుటుంబ కన్నీటి గాథ ఇది!