ETV Bharat / city

త్వరలో ఆస్పత్రుల్లో ఖాళీల భర్తీ: ఈటల

ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత లేకుండా... వైద్య ఆరోగ్యశాఖలో పోస్టులన్నింటిని త్వరలో భర్తీ చేస్తామని మంత్రి ఈటల రాజేందర్​ అన్నారు. శాసనసభలో మెడికల్​ సీట్ల భర్తీ, సిబ్బంది కొరతపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు.

సిబ్బంది కొరత లేకుండా పోస్టులన్ని భర్తీ: మంత్రి ఈటల
author img

By

Published : Sep 18, 2019, 12:41 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా వైద్యఆరోగ్యశాఖలో పోస్టులన్నింటిని త్వరలో భర్తీ చేస్తామని మంత్రి ఈటల రాజేందర్​ అన్నారు. శాసన సభలో మెడికల్​ సీట్ల భర్తీపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. రాష్ట్రంలో 11 ప్రభుత్వ కాలేజ్​లు, 23 ప్రైవేట్​ కాలేజ్​లు ఉన్నాయని వెల్లడించారు. వీటిలో మొత్తం 4790సీట్లు ఉండగా ప్రభుత్వ సీట్లు1640, ఈఎస్ఐ 100, ఎయిమ్స్​లో 50 ​ సీట్లు ఉన్నట్లు తెలిపారు. ఎన్నారైలకు కేవలం 15 సీట్లు మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. నీట్​ పరీక్ష అమలులోకి వచ్చాక మెరిట్​ లేకుండా మెడికల్​ సీట్లను భర్తీ చేయటం లేదని స్పష్టం చేశారు. విద్యార్థుల సంఖ్యకు అనుకూలంగా కాలేజ్​లను పెంచామని... నాణ్యమైన విద్య అందించేందుకు ప్రొఫెసర్లను పెంచుకుంటూ పోతున్నట్లు స్పష్టం చేశారు. ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత లేకుండా జనాభా ప్రాతిపదికన నియామకాలు చేపట్టనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

సిబ్బంది కొరత లేకుండా పోస్టులన్ని భర్తీ: మంత్రి ఈటల

ఇవీ చూడండి: ఏడాదిన్నరలో కొత్త సచివాలయ నిర్మాణం: మంత్రి వేముల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.