ETV Bharat / city

Jagan: పక్క రాష్ట్రాలతో సత్సంబంధాలను కోరుకుంటున్నాం: జగన్‌

author img

By

Published : Jul 8, 2021, 3:21 PM IST

Updated : Jul 8, 2021, 5:15 PM IST

JAGAN
JAGAN

15:19 July 08

పక్క రాష్ట్రాలతో సత్సంబంధాలను కోరుకుంటున్నాం: జగన్‌

కృష్ణా జలాల (Krishna Water) విషయంలో తెలంగాణతో కొనసాగుతున్న వివాదంపై.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ (Ap CM Jagan) సీరియస్​గా స్పందించారు. సీమ, కోస్తా, తెలంగాణకు కృష్ణా జలాల్లో వాటా గతంలోనే ఉందని అన్నారు. ఏపీ అనంతపురం జిల్లా రాయదుర్గంలో నిర్వహించిన బహిరంగసభలో ఈ విషయమై మాట్లాడారు.  

జలాల పంపిణీ విషయంలో తెలంగాణ నేతలు ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఆక్షేపించారు. నీటి కేటాయింపుపై గతంలోనే ఒప్పందాలు జరిగాయని గుర్తు చేశారు. ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలు కేటాయించారని గుర్తు చేశారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 885 అడుగులని.. 881 అడుగులు చేరితే తప్ప నీళ్లు కిందకు రాని పరిస్థితి ఉందని వివరించారు. సీమ ఎత్తిపోతలకు 881 అడుగుల్లో లిఫ్టు పెట్టి వాడుకుంటే తప్పేముందని జగన్ ప్రశ్నించారు.

సఖ్యత ఉంటేనే...

తెలంగాణ ప్రభుత్వం కల్వకుర్తి సామర్థ్యం పెంచి చేపడుతోందని ఆరోపించారు. 796 అడుగుల్లోనే తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తి చేస్తోందని విమర్శించారు. రాష్ట్రాల మధ్య సఖ్యత ఉంటేనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. పక్క రాష్ట్రాలతో సత్సంబంధాలు కోరుకుంటున్నట్లు వెల్లడించారు. పాలకుల మధ్య సఖ్యత ఉండాలన్నారు. బైరవాని తిప్ప ప్రాజెక్టుకు యుద్ధప్రాతిపదికన భూసేకరణ చేపడతామని జగన్ స్పష్టం చేశారు. ప్రాజెక్టు కోసం 1,400 ఎకరాల భూసేకరణ జరగాలన్నారు. కర్ణాటక, తమిళనాడు రాజకీయాల్లో జోక్యం చేసుకోబోనని జగన్ స్పష్టం చేశారు. భవిష్యత్తులోనూ ఇతర రాష్ట్రాల రాజకీయాల్లో జోక్యం చేసుకోనన్నారు.

ఒక్కసారి రాయలసీమ పరిస్థితిని గమనించండి. పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు కిందకు రావాలంటే 881 అడుగులు చేరితే తప్ప ఫుల్ డిశ్చార్జ్ నీళ్లు కిందకు రాని పరిస్థితి. పక్క రాష్ట్రంలో పాలమూరు- రంగారెడ్డి తీసుకున్నా... డిండి ప్రాజెక్టు తీసుకున్నా.. కల్వకుర్తి కెపాసిటీ పెంచి వాడుకుంటున్న పరిస్థితిని చూసుకుంటున్నా అన్ని కూడా 800 అడుగులలోపే. నీళ్లు వాడుకునే వెలుసుబాటు తెలంగాణ రాష్ట్రానికి ఉంది. మరోవైపు 796 అడుగుల వద్ద తెలంగాణ రాష్ట్రం కరెంట్ జనరేట్ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. 800 అడుగులలోపే మీకు కేటాయించిన నీటి వాటాను వాడుకుంటే తప్పులేనప్పుడు... 881 అడుగులు పోతే తప్ప నీళ్లు వాడుకోలేని పరిస్థితి మాకు కన్పిస్తున్నప్పుడు... అదే 800 అడుగుల్లో మేము కూడా రాయలసీమ లిఫ్ట్ పెట్టి మాకు కేటాయించిన నీళ్లను మేము వాడుకుంటే తప్పేముంది. రైతు ఎక్కడున్న రైతే. నీళ్లు అందరికీ ప్రియం. వాళ్లు బతకాలి మనమూ బతకాలి.

                       -- జగన్ మోహన్ రెడ్డి, ఏపీ సీఎం  

ఇదీ చూడండి: TS AP WATER WAR: కృష్ణా జలాల వివాదంపై స్వరం పెంచిన తెలుగు రాష్ట్రాలు

Last Updated : Jul 8, 2021, 5:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.