ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఆయన.. సామాన్య కుటుంబం నుంచి ఈ స్థాయికి వచ్చానంటూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. వ్యక్తులు వస్తుంటారు.. వెళ్తుంటారు.. కానీ వ్యవస్థల ఔన్నత్యం కాపాడాలన్నారు.
ఒక్కోసారి రాత్రి 10 వరకు కూడా పనిచేయాల్సి వచ్చిందనే విషయాన్ని గుర్తుచేసుకున్నారు. అందరి సహకారంతోనే సమర్థవంతంగా విధులు నిర్వహించానని పేర్కొన్నారు. సహచర జడ్జిలు, సిబ్బంది అభిమానం మరచిపోలేనన్నారు. న్యాయవ్యవస్థ ప్రతిష్ఠ పెంచేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు. అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నానన్నారు.
వీడ్కోలు ఎప్పుడూ బాధాకరంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. వీడ్కోలు సమావేశంలో... సహచరులు, సిబ్బందిని జస్టిస్ మహేశ్వరి ఆలింగనం చేసుకున్నారు.
జస్టిస్ మహేశ్వరి సిక్కిం హైకోర్టుకు బదిలీకాగా... సిక్కిం రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆరూప్ గోస్వామి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీజేగా నియమితులయ్యారు.
ఇవీచూడండి: ఈ నెల 7న హైకోర్టు నూతన సీజే ప్రమాణస్వీకారం