ETV Bharat / city

'ప్రభుత్వ శాఖలతో వక్ఫ్​ బోర్డు ఆస్తుల అనుసంధానం' - waqf board chairman mahmood saleem

జీహెచ్ఎంసీ, హెచ్‌ఎండీఏ ప‌రిధిలోని వ‌‌క్ఫ్ బోర్డు ఆస్తుల‌కు జియోట్యాగింగ్ చేసి ప్ర‌భుత్వ శాఖ‌లు, ఏజెన్సీల‌తో అనుసంధానం చేస్తామ‌ని హైదరాబాద్ మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ అన్నారు. నాంపల్లిలో వక్ఫ్​ బోర్డు ఛైర్మన్ మహమూద్ సలీమ్​తో సమావేశమయ్యారు.

waqf-board-properties-integrated-to-public-sector-and-agencies
హైదరాబాద్ మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్
author img

By

Published : Aug 18, 2020, 4:11 PM IST

జీహెచ్​ఎంసీ, హెచ్​ఎండీఏ పరిధిలోని వక్ఫ్​ బోర్డు ఆస్తులకు జియో ట్యాగింగ్ చేసి ప్రభుత్వ శాఖలు, ఏజెన్సీలకు అనుసంధానం చేస్తామని మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. ఎస్సార్డీపీ ప్రాజెక్ట్‌ నిర్మాణం, లింక్ రోడ్ల అభివృద్దికి అవ‌స‌ర‌మైన వ‌క్ఫ్ భూముల సేక‌ర‌ణ‌లో జాప్య నివార‌ణకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పారు.

నాంప‌ల్లి వ‌క్ఫ్ బోర్డు కార్యాల‌యంలో వ‌క్ఫ్ బోర్డు ఛైర్మ‌న్ మ‌హమూద్ సలీమ్​తో జీహెచ్ఎంసీ మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ స‌మావేశమయ్యారు. వ‌క్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా ప‌రిర‌క్షించడానికి ప్ర‌భుత్వ శాఖ‌లు, ఏజెన్సీల‌ు స‌మ‌న్వ‌యంతో వ్య‌వ‌హ‌రించాలని సూచించారు. జీహెచ్ఎంసీ అభివృద్ది ప‌నులకు తీసుకుంటున్న వ‌క్ఫ్ భూముల ప‌రిహారాన్ని వ‌క్ఫ్ బోర్డుకే చెందే విధంగా జియోట్యాగింగ్ ఉప‌యోగ‌ప‌డుతుందని మేయ‌ర్ వెల్ల‌డించారు.

వ‌క్ఫ్ బోర్డు ఆస్తుల ప‌రిర‌క్ష‌ణ‌కు జీహెచ్ఎంసీ, ఇత‌ర ప్ర‌భుత్వ శాఖ‌లతో క‌లిసి ప‌నిచేస్తామ‌ని వ‌క్ఫ్ బోర్డు ఛైర్మ‌న్ మ‌హమూద్ స‌లీమ్ తెలిపారు. జీహెచ్ఎంసీ అభివృద్ది ప‌నుల‌కు వ‌క్ఫ్ బోర్డు స‌హ‌క‌రిస్తుందని పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.