తమ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకునేందుకు జనవరిలో మహాసభ నిర్వహిస్తున్నామని గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సతీశ్, ప్రధాన కార్యదర్శి పల్లెపాటి నరేశ్ వెల్లడించారు. ఈ సభకు మంత్రి కేటీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు. ఈ అంశంపై హైదరాబాద్‌లోని టీఎన్జీవో భవన్లో ఉద్యోగ జేఏసీ నేతలతో భేటీ అయ్యారు.
వీఆర్వోల భవిష్యత్తుపై జేఏసీ ఛైర్మన్ మామిళ్ల రాజేందర్‌తో చర్చించినట్లు వారు ప్రకటించారు. నూతన సంవత్సరంలో ఉద్యోగ జేఏసీ, రెవెన్యూ సంఘం నాయకుల ద్వారా సీఎం కేసీఆర్‌ను కలిసి వీఆర్వోల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. సీనియారిటీ, ప్రమోషన్లు వెంటనే కల్పించాలని కోరతామని స్పష్టం చేశారు.