పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరు పేటలో నివాసముంటున్న చలువాది మల్లి విష్ణు వందన ఎన్నో ఏళ్లుగా బియ్యం గింజలపై శ్రీరామ నామాన్ని రచిస్తున్నారు. శ్రీరామ జపాన్ని పఠిస్తూ 50,116 బియ్యపు గింజలపై నామాన్ని రచించారు. అయోధ్యలో భూమి పూజ జరుగుతున్న కార్యక్రమంలో ఈ బియ్యాన్ని వినియోగించేలా మందిరం ట్రస్టు నిర్వాహకులకు.. స్థానిక భాజపా, విశ్వ హిందూ ఫరిషత్ నాయకులు ద్వారా పంపించారు.
శ్రీ రామ నామాలు రాసిన బియ్యాన్ని స్థానిక ఆలయంలో పూజలు చేసి పంపారు. 2017లో బియ్యపు గింజలపై శ్రీ రామ జపాన్ని రాయడం మొదలు పెట్టారు. తర్వాత ఒంటమిట్ట శ్రీ రాముని ఉత్సవాలకు బియ్యాన్ని పంపుతున్నారు. ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకున్న వందన బియ్యం గింజలపై రాయడం అలవాటు చేసుకున్నారు. భక్తి శ్రద్ధలతో శ్రీ రామ నామాలు రాసి ప్రత్యేకత చాటుకుంటున్నారు.