ETV Bharat / city

ఎల్‌జీ పాలిమర్స్‌ దుర్ఘటనకు నేటికి ఏడాది

author img

By

Published : May 7, 2021, 1:20 AM IST

ఏపీలో జరిగిన ఎల్‌జీ పాలిమర్స్‌ దుర్ఘటన విశాఖ ప్రజల జీవితాల్లో పీడకలగా మిగిలిపోయింది. విష వాయువు 12 మందిని పొట్టన పెట్టుకుంది.. వేలాది మందిని అచేతనంగా మార్చేసింది. నాటి భయానక పరిస్థితులు ఇప్పటికీ వెంకటాపురం, వెంకటాద్రిగార్డెన్‌, పద్మనాభనగర్‌, జనతాకాలనీ వాసుల కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి.. నగరంలోని ఇతర ప్రాంతాలకు స్టైరీన్‌ విషవాయువు వ్యాపించి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసింది. నగరవాసులకు మూడు రోజుల పాటు కంటిమీద కునుకు లేకుండా చేసింది. స్టైరీన్‌ ట్యాంకు పేలిపోతుందనే వదంతులతో అడవివరం, వేపగుంట, పెందుర్తి, చినముషిడివాడ, సుజాతనగర్‌ తదితర ప్రాంతాల వాసులు ఇళ్లు వదలి రోడ్లపైకి వచ్చేశారు.. రాత్రంతా రోడ్లపై బిక్కుబిక్కుమంటూ తిరుగుతూనే ఉన్నారు.. నాటి విషాద ఘటనకు ఈనెల ఏడో తేదీకి ఏడాది పూర్తవుతోంది.

1 year to LG Polymers incident
1 year to LG Polymers incident

ఎవరిని కదిపినా కన్నీటి సుడులే...

స్టైరీన్‌ ఆవిర్లు లీకైన ట్యాంకు సమీపంలో ఉన్న వెంకటాపురం, వెంకటాద్రినగర్‌ గ్రామాల్లోని ప్రజలు అధిక శాతం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. స్థానికులను ఎవరిని కదిపినా కన్నీటి సుడులే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, 50 ఏళ్ల పైబడిన వాళ్లు తరచూ అలసటకు గురై నీరస పడిపోతున్నారు. ‘ప్రమాదం జరగక ముందు ఎన్ని గంటలైనా పనులు చేసేవాళ్లం.. ఇప్పుడు రెండు గంటలైనా శ్రమించలేకపోతున్నాం. గుండెల్లో బరువుగా అనిపించడంతోపాటు కాళ్లూ చేతులు పీకడం, మోకాళ్లు పట్టేస్తున్నాయి. మహిళల్లో ఆయాసం, తలనొప్పి, అజీర్తి సమస్యలు వస్తున్నాయి. కొద్దిమంది యువతలో ఆయాసం, త్వరగా అలసిపోవడం, తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయ’ని బాధితులు వాపోతున్నారు.

పెద్దదిక్కును కోల్పోయా..

విషవాయువు పీల్చి నా భర్త యలమంచిలి కనకరాజు మృతిచెందారు. అప్పట్లో మృతుల కుటుంబాలకు రూ.కోటి సాయం అందిస్తామని ప్రభుత్వం చెప్పింది. మాకు ఇప్పటికీ అందించలేదు. మరో రెండు కుటుంబాలకు అందాలి. అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోయింది. - యలమంచిలి లావణ్య, వెంకటాపురం

ఇప్పటికీ ఆయాసంగానే..

ప్రమాదం జరిగిన ఏడాదవుతున్నా ఆయాసం తగ్గడం లేదు. నీరసంగా ఉంటోంది. విషవాయువు పీల్చిన నెల రోజుల వరకు ఆరోగ్యం బాగోలేదు. తలకు గాయమై పడిపోవడంతో శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. స్టైరీన్‌ గ్యాస్‌ శరీరానికి పట్టేయడంతో చర్మమంతా పొలుసుల్లా ఊడిపోయింది. రాత్రి నిద్ర సమయంలో గురక, గుండెల్లో భారం వంటి లక్షణాలు బాధిస్తున్నాయి. 30 ఏళ్ల వయసులోనే అనారోగ్యంతో బాధపడాల్సి వస్తోంది. -వురికూటి రాజేష్‌, వెంకటాపురం

హామీలు నెరవేరలేదు..

ఎల్‌జీ పాజిమర్స్‌ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల వెంకటాద్రి గార్డెన్స్‌ ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకొంది. నాడు ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు నెరవేర్చలేదు. మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేస్తామన్నారు. దాని గురించి ఆలోచనే చేయలేదు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వైద్య కేంద్రం కొద్ది నెలలే పనిచేసింది. కనీసం బీపీ, మధుమేహ పరీక్షలు చేసేవారు కాదు. హెల్త్‌కార్డులు ఎందుకు ఇచ్చారో తెలియడం లేదు. -జి. శ్రీనివాసరావు, వెంకటాద్రి గార్డెన్స్‌

ఐసీయూలో చికిత్స పొందినా..

విషవాయులు పీల్చి కుటుంబంలోని అందరూ తీవ్ర అస్వస్థతకు గురయ్యాం. నాతో పాటు చిన్న కుమారుడు నవీన్‌ను కాపాడేందుకు వచ్చిన బంధువులు ఎం.లలిత్‌, పి.మహేష్‌ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఐసీయూలో తొమ్మిది రోజులు ఉన్నాం. అయినప్పటికీ ఎటువంటి పరిహారం అందలేదు. నాలుగుసార్లు కలెక్టరు కార్యాలయం, జిల్లా వైద్యశాఖ అధికారికి అర్జీలు ఇచ్చినా పట్టించుకోలేదు. దుస్తులు ఇస్త్రీ చేస్తేగాని కుటుంబం గడవదు. సాయం అందించి ఆదుకోవాలి - ఎస్‌.శ్రీనివాసరావు, వెంకటాద్రి గార్డెన్స్‌

భూగర్భ జలాలు కలుషితం...

వెంకటాద్రి గార్డెన్స్‌లో భూగర్భ జలాలు రంగుమారి కనిపిస్తున్నాయి. ముందు నుంచే అక్కడి నీరు కలుషితం అయినప్పటికీ స్టైరీన్‌ విషవాయువులు వెలువడిన తరువాత భూగర్భం నుంచి వచ్చే నీరు మరింత ముదురు రంగులోకి మారిపోయిందని స్థానికులు చెబుతున్నారు. ఆ నీరు ఉపయోగించడానికి వీలులేకుండా ఉందని స్థానికులు వాపోతున్నారు. దుర్ఘటన తరువాత పర్యావరణ పరంగా, భూగర్భంలో చోటు చేసుకున్న మార్పులపై ఎటువంటి పరీక్షలు చేయలేదని అంటున్నారు. ఈ ప్రాంతంలో మొక్కలు సైతం సరిగ్గా పెరగడం లేదని వెల్లడిస్తున్నారు.

ఇదీ చదవండి: బిడ్డ పుట్టే వరకు గర్భవతి అని తెలీదట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.