ETV Bharat / city

కోతులకు అంతిమ సంస్కారం.. గ్రామస్థుల ఔదార్యం

సాధారణంగా సాటి మనిషికి ఏదైనా ప్రమాదం జరిగి మరణిస్తే పట్టించుకోవడమే ప్రస్తుత రోజుల్లో గగనం. కానీ రెండు కోతులు విద్యుత్​ షాక్​తో ప్రమాదవశాత్తు మరణిస్తే వాటికి దహన సంస్కారాలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు ఆ గ్రామస్థులు. కడప జిల్లా వెలమవారిపల్లెలోని అరుదైన ఘటన పూర్తి వివరాలివి..!

monkey
monkey
author img

By

Published : Jul 28, 2020, 10:44 PM IST

కడప జిల్లా పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని కె వెలమవారిపల్లె గ్రామంలో రెండు కోతులు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్​తో మృతి చెందాయి. ఇది గమనించిన గ్రామస్థులు ఆవేదన చెందారు. కోతుల మృతదేహాలకు స్నానాలు చేయించి.. గుంతలు తవ్వి పూడ్చి పెట్టారు.

అక్కడ కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు. మానవత్వం మంట కలిసిపోతున్న ఈ కాలంలో కోతులకు దహన సంస్కారాలు చేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. అక్కడే ఉన్న పిల్లకోతిని కాపాడి సంరక్షించారు.

ఇదీ చదవండి: ఏ చావైనా.. కొవిడ్​ చావుగా భావించడం సరికాదు: మంత్రి ఈటల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.