ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని సినిమా థియేటర్లకు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి లేఖ రాయడం కలకలం రేపుతోంది. సినిమా విడుదల సందర్భంగా మెుదటి రోజు ప్రతి షోకు మల్టీప్లెక్స్ థియేటర్లు 100 టికెట్లు పంపాలని లేఖలో కోరారు. ఈ మేరకు అన్ని మల్టీప్లెక్స్‌ల థియేటర్లకు లేఖలు రాశారు.
పార్టీ కార్పొరేటర్లు, నాయకులు సినిమా టికెట్లు అడుగుతున్నారని.. వారి కోసం సినిమా టికెట్లను ఛాంబర్‌కు పంపాలని మేయర్ కోరారు. అందుకు అయ్యే డబ్బులు కూడా చెల్లిస్తామని లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే, నేరుగా నగర మేయర్ నుంచి టికెట్ల కోసం లేఖ రావటంతో థియేటర్ యజమానులు విస్తుపోయారు.
ఇదీ చూడండి: Radheshyam: రాధేశ్యామ్ మూవీ ట్విట్టర్ రివ్యూ.. ఎలా ఉందంటే?