ETV Bharat / city

భారీ వర్ష సూచనతో అప్రమత్తమైన విపత్తు నిర్వహణా శాఖ

author img

By

Published : Jun 12, 2021, 7:03 AM IST

వాతావరణ శాఖ అందించే సూచనలను అధికారులు పాటించాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా తెలిపారు. రానున్న రెండ్రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాగాన్ని సిద్ధం చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

Authorities review over heavy rains
భారీ వర్షాలతో అప్రమత్తమైన అధికారులు

రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ అప్రమత్తమైంది. జిల్లా యంత్రాంగాన్ని సిద్ధం చేయాల్సిందిగా పలు జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. వరదలు, లోతట్టు ప్రాంతాల్లో నీటి ప్రవాహం, చెట్లు విరగటం, విద్యుత్ సేవల అంతరాయం, రోడ్లు, ట్యాంకులు వంటి మౌలిక సదుపాయాలకు వాటిల్లే నష్టంపై జాగ్రత్తగా వహించాలని సూచించింది.

వాతావరణ శాఖ అందించే సూచనలను అధికారులు పాటించాలని రాష్ట్రం విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా తెలిపారు. రానున్న రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా బలమైన గాలులు, ఉరుములు, మెరుపులతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, మెదక్​లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాహుల్ వివరించారు.

ఇదీ చదవండి: Black Fungus: వ్యాధికి చికిత్స ఉందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.