ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో స్థానిక వైకాపా నాయకుడి అనుచరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఓ కేసులో వరప్రసాద్ అనే ఎస్సీ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇసుక లారీలు అడ్డుకున్నందుకు మునికూడలి వద్ద స్థానిక వైకాపా నాయకుడు కవల కృష్ణమూర్తి కారుతో వచ్చి ఢీకొట్టినట్లు బాధితుడు ఆరోపించాడు. పోలీస్‌స్టేషన్‌లో తనను విచక్షణారహితంగా కొట్టి జుట్టు, మీసాలు తీసేశారని.. తనని చంపేస్తారని బాధితుడు వాపోయాడు.
వైకాపా నాయకుడి అనుచరుడి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి.. తన కుమారున్ని సీతానగరం పీఎస్‌కు పోలీసులు తీసుకువెళ్లారని భాదితుడి తల్లి చెబుతుంది. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి చూసేసరికి తన బిడ్డ అపస్మారక స్థితిలో ఉన్నాడని... ఆవేదన వ్యక్తం చేసింది.
ఇదీ చదవండి: పోలీస్ స్టేషన్లోనే ఎస్సీ యువకుడికి గుండు గీసిన పోలీసులు