ETV Bharat / city

జైపాల్ రెడ్డి భారత రాజకీయాల్లో అరుదైన రాజనీతిజ్ఞుడు: వెంకయ్య - పది భావజాలాలు పుస్తకాన్ని ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు

దివంగత నేత జైపాల్‌ రెడ్డితో చాలా విషయాలలో వ్యతిరేకించే వాడినని... అయినా అభిప్రాయబేధాలను పరస్పరం గౌరవించుకునే వాళ్లమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గుర్తు చేసుకున్నారు. జైపాల్‌ రెడ్డి రాసిన టెన్‌ ఐడియాజిస్‌ పుస్తకాన్ని 'పది భావజాలాలు' పేరుతో తెలుగులోకి ప్రముఖ జర్నలిస్టు భాస్కరం అనువదించిన పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దిల్లీ నుంచి ఆన్‌లైన్‌ ద్వారా ఆవిష్కరించారు. ఈ పది భావజాలాలు రాజకీయాల్లో చాలా అవసరమన్న వెంకయ్య... జైపాల్ రెడ్డి లోతైన అధ్యయనం, విశ్లేషణలతో అందరి మనసులను గెలిచారని కొనియాడారు.

Vice President Venkaiah Naidu
Vice President Venkaiah Naidu
author img

By

Published : Jul 28, 2020, 9:27 PM IST

కేంద్ర మాజీ మంత్రి, దివంగత నేత జైపాల్‌ రెడ్డి ఎక్కడ రాజీపడేవారు కాదని, ఆయన జాతీయ, అంతర్జాతీయ అంశాలపై మంచి పట్టున్న వ్యక్తని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు. జైపాల్‌ రెడ్డి ఆంగ్లంలో రాసిన "టెన్‌ ఐడియాలజీస్‌'' పుస్తకాన్ని ప్రముఖ జర్నలిస్టు అల్లూరి భాస్కరం "పది భావజాలాలు'' పేరుతో తెలుగులోకి అనువదించారు. ఆ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దిల్లీ నుంచి ఆన్‌లైన్‌ ద్వారా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఆర్బీఐ మాజీ గవర్నర్‌ వైవి.రెడ్డి, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్‌ రెడ్డి ఆన్‌లైన్‌ ద్వారా పాల్గొన్నారు.

ఆయన నవ్వులో వెలుగు ఉండేది

పుస్తకాన్ని రాసిన అల్లూరి భాస్కరంతో పాటు ప్రముఖులు అంతా కూడా జైపాల్‌ రెడ్డితో వాళ్లకు ఉన్న అనుంబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ పుస్తకంలో జైపాల్‌ రెడ్డి రాసిన పది భావజాలాలు ఎంతో లోతైన అంశాలతో రాశారో వివరించారు. 1963లో తనకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జైపాల్‌ రెడ్డి స్టూడెంట్ యూనియన్‌ నాయకుడిగా పరిచయమైనట్లు పేర్కొన్న ఆర్బీఐ మాజీ గవర్నర్‌ వైవి.రెడ్డి... జైపాల్ రెడ్డి నవ్వులో ఒక వెలుగు ఉండేదని అభివర్ణించారు. ఈ పుస్తకానికి ఒక ప్రత్యేక ఉందని... అదొక జ్ఞానం అందించే పుస్తకమని కొనియాడారు.

ఏదో కొత్త విషయాన్ని నేర్చుకునేవాడిని

జైపాల్‌ రెడ్డి గురించి ఎంత చెప్పినా తక్కువేనని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కొనియాడారు. పుస్తకం రాసే సమయంలో చాలా సార్లు తనకు పంపించేవారని... ఇంకా ఏమి రాయవచ్చో అడిగే వారని గుర్తు చేసుకున్నారు. జైపాల్‌ రెడ్డి మన మధ్య లేకుండా పోయి ఏడాది గడిచిందంటే... నమ్మకంగా లేదని ఆయనను కలిసిన ప్రతిసారి ఏదొక కొత్త విషయాన్ని తెలుసుకుని వచ్చేవాడినన్నారు.

తాత్విక దృక్పథం కలిగిన వ్యక్తి

జైపాల్‌ రెడ్డి భౌతికంగా దూరమైనా కీర్తి రూపంలో చిరస్థాయిగా నిలిచారని, లోతైన అధ్యయనం, విశ్లేషణలతో అందరి మనసులను గెలిచారని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు కొనియాడారు. జైపాల్‌ రెడ్డి ఆంగ్లంలో రాసిన టెన్‌ ఐడియాజిస్‌ అన్న పుస్తకాన్ని ప్రముఖ జర్నలిస్టు భాస్కరం చక్కగా అనువదించారన్నారు. జైపాల్‌ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన రాజకీయ నాయకుడు అనే కంటే తాత్విక దృక్పథం కలిగిన వ్యక్తని అన్నారు. భారత రాజకీయాల్లో అరుదైన రాజనీతిజ్ఞుడని కొనియాడారు. కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార శాఖ మంత్రిగా ఆయన అనేక నిర్ణయాలు తీసుకున్నారని... నిష్కలంకమైన జైపాల్‌ రెడ్డి జీవితం ఈ సమాజానికి స్ఫూర్తి కావాలన్నారు.

ఇదీ చదవండి: ఏ చావైనా.. కొవిడ్​ చావుగా భావించడం సరికాదు: మంత్రి ఈటల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.