Vice President about Pinnamaneni: రాజకీయ పార్టీలు ఇచ్చే హామీలు బాధ్యతాయుతంగా.. ఆచరణ సాధ్యమైనవై ఉండాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని అన్ని పార్టీలూ గుర్తుంచుకోవాలని సూచించారు. రాజకీయాల్లో స్థాయి తగ్గిపోతోందనే భావన పెరుగుతోందని.. నేతలు తాము మాట్లాడే భాషను సమీక్షించుకోవాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దివంగత మాజీ జడ్పీ ఛైర్మన్ పిన్నమనేని కోటేశ్వరరావు కాంస్య విగ్రహాన్ని ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జోగి రమేశ్, మాజీ మంత్రి పేర్ని నాని, ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను తదితరులు పాల్గొన్నారు.
ఛైర్మన్ అంటే ఆయనే అనేలా 27 ఏళ్ల పాటు సుదీర్ఘకాలం పిన్నమనేని కోటేశ్వరరావు పనిచేశారని వెంకయ్యనాయుడు చెప్పారు. అంతకాలం జడ్పీ ఛైర్మన్‌గా పనిచేయడం సాధారణ విషయం కాదన్నారు. ఆదర్శ ప్రజానాయకుడికి ఉండాల్సిన అన్ని లక్షణాలు పరిపూర్ణంగా కలిగిన వ్యక్తి పిన్నమనేని అని ఉపరాష్ట్రపతి కొనియాడారు. పార్టీ మారకుండా పార్టీలకు అతీతంగా పనిచేశారని.. దీన్ని నేటితరం నేతలు నేర్చుకోవాలని సూచించారు. రాత్రి పడుకునే ముందు ఈరోజు ఏం చేశామనేదాన్ని ప్రతి నాయకుడూ సమీక్షించుకోవాలన్నారు. కుల, మత, వర్గాల పేరుతో జాతిని చీల్చే ప్రయత్నం చేస్తున్నారని.. ఇది మంచిది కాదని హితవు పలికారు.
ఇవీ చదవండి: రాష్ట్రానికి రావాల్సిన నిధులివ్వకుండా కేంద్రం శీతకన్ను: కేటీఆర్
కూల్‌డ్రింక్స్‌లో మత్తుమందు కలిపి మూడ్రోజులుగా యువతిపై అత్యాచారం..