దేశ ప్రజలందరికీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దేశవ్యాప్తంగా ఆనందోత్సాహాల మధ్య దసరా పండగను వైభవోపేతంగా జరుపుకోవడం సంప్రదాయంగా వస్తోందన్నారు. కొవిడ్ మహమ్మారి ప్రమాదం పొంచిఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కరోనా నిబంధనలు పాటిస్తూ పండగ జరుపుకోవాలని ఉపరాష్ట్రపతి సూచించారు. ప్రజల జీవితాల్లో దసరా పండగ శాంతి, శ్రేయస్సును చేకూర్చాలని వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు.
ఇవీ చూడండి: ఆత్మగౌరవంతో పండుగలు జరుపుకుంటున్నాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్