ETV Bharat / city

Anandayya medicine: ఆనందయ్య ఔషధం పరిశోధన పురోగతిపై ఉపరాష్ట్రపతి ఆరా - Anandayya medicine Latest News

ఆనందయ్య ఔషధం (Anandayya medicine) పరిశోధన పురోగతిపై ఉపరాష్ట్రపతి ఆరాతీశారు. కేంద్రమంత్రి కిరణ్ రిజిజు, ఐసీఎంఆర్ డైరెక్టర్‌ జనరల్‌తో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడారు. వీలైనంత త్వరగా పరిశోధన పూర్తి చేయాలని కేంద్ర మంత్రికి వెంకయ్య సూచించారు.

vice president
ఆనందయ్య ఔషధం పరిశోధన పురోగతిపై ఉపరాష్ట్రపతి ఆరా
author img

By

Published : May 27, 2021, 5:37 PM IST

ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన ఆనందయ్య మందు (Anandayya medicine)పై పరిశోధన పురోగతి గురించి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(vice president) ఆరా తీశారు. కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి కిరణ్ రిజిజుకు ఫోన్ చేశారు. పరిశోధన పురోగతి గురించి ఉపరాష్ట్రపతికి.. కేంద్రమంత్రి వివరించారు. సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ (సీసీఆర్ఏఎస్) ఆధ్వర్యంలో, ఏపీ ఆయుష్ విభాగం సహకారంతో ఆనందయ్య మందు(Anandayya medicine)ను ఇప్పటికే వినియోగించిన 500 మంది నుంచి వివరాలు సేకరించినట్లు తెలిపారు. ఆ సమాచారంతో పరిశోధన జరుపుతున్నామని, వీలైనంత త్వరలోనే నివేదిక సిద్ధం చేస్తామని చెప్పారు.

వివాదాలకు తావులేకుండా అన్ని కోణాల నుంచి పరిశోధన చేయాల్సి ఉంటుందని, అందువల్ల కాస్త సమయం పడుతోందని ఉపరాష్ట్రపతికి వివరించారు. ఈ విషయంపై రాజీ పడకుండా, వీలైనంత త్వరగా పరిశోధనను పూర్తి చేస్తామని ఉపరాష్ట్రపతికి వివరించారు. అనంతరం ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ ప్రొ.బలరాం భార్గవ్​తోనూ ఉపరాష్ట్రపతి ఫోన్​లో మాట్లాడారు. ఈ మందు ఆయుష్ విభాగ పరిధిలోనిదని, ఇప్పటికే వారి పరిశోధన ప్రారంభమై, కొనసాగుతున్న నేపథ్యంలో మళ్లీ అదనంగా ఐసీఎంఆర్(icmr) విచారణ అవసరం లేదని ఆయన ఉపరాష్ట్రపతికి తెలియజేశారు.

ఇవీచూడండి:

Anandayya: ఆనందయ్య మందుపై తొలిదశ అధ్యయనం పూర్తి

'ఆనందయ్య మందుపై ఎవరు అనుమతివ్వాలో కేంద్రం తెలపాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.