ETV Bharat / city

రాష్ట్ర మంత్రులతో ప్రమాదం పొంచి ఉంది: వీహెచ్​ - కాంగ్రెస్​ సీనియర్​ నేత వీహెచ్​ వార్తలు

కేసీఆర్​ సర్కార్​పై కాంగ్రెస్​ సీనియర్​ నేత నిప్పులు చెరిగారు. ఉస్మానియాలోకి నీరు రావడానికి ప్రతిపక్షాలే కారణమని మంత్రులు చేసిన విమర్శలను తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ భజనపరులైన మంత్రులతో ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు.

రాష్ట్ర మంత్రులతో ప్రమాదం పొంచి ఉంది: వీహెచ్​

author img

By

Published : Jul 17, 2020, 6:35 PM IST

బేగంబజార్ నుంచి ఉస్మానియా ఆస్పత్రిలోకి నీళ్లు రావడానికి ప్రతిపక్షాలే కారణమని మంత్రులు చేసిన విమర్శలపై కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ.. కరోనా కంటే ప్రమాదమని మంత్రులు ఎలా విమర్శిస్తారని నిలదీశారు. ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ, దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన పార్టీ కాంగ్రెస్​ అని గుర్తు చేశారు. హెరిటేజ్ బిల్డింగ్ పక్కన ఉస్మానియా ఆస్పత్రి కోసం కొత్త బిల్డింగ్ కట్టాలని సూచించామన్నారు. ఉస్మానియా హెరిటేజ్ బిల్డింగ్ కాబట్టి మరమ్మతులు చేయమని చెప్పినట్లు వివరించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ భజనపరులైన మంత్రులతో ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. రాష్ట్రమంత్రులు ఏది పడితే అది మాట్లాడితే మంచిది కాదని, భాష మార్చుకోవాలని సూచించారు. రాజకీయ నాయకుల భాష హుందాగా ఉండాలని, సీఎం కేసీఆర్​ను సంతోషపెట్టడానికి ప్రతి పక్షాలను తక్కువ చేసి మాట్లాడడం సరికాదన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.