మంచి కుటుంబాన్ని తయారు చేయటమే సమాజానికి మనమిచ్చే అతిపెద్ద కానుక అని ఈనాడు ఎడిటర్ ఎం నాగేశ్వర రావు పేర్కొన్నారు. హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన వాసిరెడ్డి కాశీరత్నం పుస్తకావిష్కరణ కార్యక్రమంలో లోక్‌సత్తా వ్యవస్థాకులు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ, మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలచారితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వాసిరెడ్డి కాశీరత్నం పుస్తక రచయిత్రి డాక్టర్ హసీనాతో పాటు.. వాసిరెడ్డి కాశీరత్నం కుమార్తెలు ఇంద్రాణీ, మైత్రేయి, పద్మ, కుటుంబ సభ్యులు భాగస్వాములయ్యారు.
కుటుంబమంతా కలిసికట్టుగా ఉండేలా తీర్చిదిద్దటంతో పాటు.. పిల్లలకు మంచి విలువలు నేర్పారంటూ వాసిరెడ్డి కాశీరత్నంను నాగేశ్వరరావు కొనియాడారు. మహిళల సమగ్రతకు మారుపేరు కాశీరత్నమని ప్రశంసించారు. వాసిరెడ్డి నారాయణ రావుతో తనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. నారాయణరావు నిక్కచ్చితత్వంతో అన్నదాతను దేశంలోనే అత్యంత ప్రజాధరణ పొందిన మాసపత్రికగా తీర్చిదిద్దారన్నారు. తామిద్దరు ఒకేసారి జర్నలిజం కెరీర్‌ను ప్రారంభించామన్న నాగేశ్వరరావు.. మూడు దశాబ్దాల పాటు సాగిన తమ అనుబంధాన్ని నెమరువేసుకున్నారు.
స్ఫూర్తిదాయక జీవితం వారిది..
"వాసిరెడ్డి కాశీరత్నం పుస్తకం స్ఫూర్తిదాయకం. కాశీరత్నం జీవితం ఎవరినైనా ప్రభావితం చేస్తుంది. కాశీరత్నం కూమార్తెలు వాళ్ల తల్లి గురించి రాస్తున్నప్పుడు నాకు మా అమ్మ గుర్తొచ్చింది. అమ్మలందరూ ఒకేలా ఉంటారేమో. ఒక వేలు పిడికిలి కాదు.. ఒక చెట్టు వనం కాదని మా అమ్మ చెప్పేది. ఏదైనా వివాదం తలెత్తితే.. ఓర్పుతోనే సమాధానం చెప్పేది. తన ప్రవర్తనతో వారిలో పరివర్తన తీసుకొచ్చే మనస్తత్వం కాశీరత్నానిదని హసీనా నాకు చెప్పారు. మానవ ప్రవర్తనకు, పరివర్తనకు దోహదపడే ఎన్నో విషయాలు పుస్తకంలో పొందుపరిచారు. అన్నింటికీ మించి కాశీరత్నం ఒక జర్నలిస్టు. జర్నలిస్టుగా ఆమె సేవ అనిర్వచనీయం. మహిళా విజయం అనే పత్రికను ఇన్ని రోజులుగా నడిపించటం ఆమె కృషికి నిదర్శనం." - నాగేశ్వరావు, ఈనాడు ఎడిటర్
వ్యక్తి జీవితాన్ని, కుటుంబ బాధ్యతను, సమాజ హితాన్ని ఎలా సంతానిచవచ్చో కాశీరత్నం గొప్ప ఉదాహరణ అని జయప్రకాశ్ నారాయణ కొనియాడారు. ఈ పుస్తకం ద్వారా ఎట్టకేలకు మహిళలకు స్వయం గుర్తింపు లభిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. మహిళల ఆత్మగౌరవానికి కాశీరత్నం ప్రతీకగా నిలిచారని... పుస్తక రచయిత్రి డాక్టర్ హసీనా పేర్కొన్నారు.
ఇదీ చూడండి: