ETV Bharat / city

వరవరరావు ఆరోగ్య కారణాలు ఓ ఎత్తుగడ మాత్రమే: ఎన్‌ఐఏ - వరవరరావు కేసు

కవి, రచయిత వరవరరావు ఆరోగ్యం స్థిరంగా ఉందని బొంబాయి హైకోర్టుకు ఎన్‌ఐఏ అని వెల్లడించింది. ఆరోగ్య కారణాలతో బెయిలు దరఖాస్తు దాఖలు చేయడం కేవలం ఓ ఎత్తుగడ మాత్రమేనని తెలిపింది. జేజే ఆసుపత్రి సూపరింటెండెంట్‌ సమర్పించిన వరవరరావు ఆరోగ్య నివేదిక ప్రకారం ఆయనకు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స అందించాల్సినంతగా ఆరోగ్య సమస్యలు లేవని ఎన్‌ఐఏ గుర్తుచేసింది.

varavara rao
varavara rao
author img

By

Published : Jul 24, 2020, 9:04 AM IST

ముంబయి ఎల్గార్‌ పరిషద్‌- మావోయిస్టుల సంబంధాల కేసులో నిందితులైన కవి, రచయిత వరవరరావు ఆరోగ్య కారణాలతో బెయిలు దరఖాస్తు దాఖలు చేయడం కేవలం ఓ ఎత్తుగడ మాత్రమేనని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) బొంబాయి హైకోర్టుకు తెలిపింది. కొవిడ్‌-19 మహమ్మారి, తన వృద్ధాప్యం ముసుగులో ఆయన అయాచిత లబ్ధి పొందాలని భావిస్తున్నారని నివేదించింది. వరవరరావు ఆరోగ్యం స్థిరంగా ఉందని, ఆయనకు సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స అవసరం లేదని ఈ నెల 16న దాఖలు చేసిన ప్రమాణపత్రంలో పేర్కొంది. 81 ఏళ్ల వరవరావు కరోనా బారిన పడినట్లు అదే రోజు వెల్లడైంది.

ఆరోగ్య సమస్యలు లేవు

వృద్ధాప్యం, ఆరోగ్య కారణాలు, కొవిడ్‌-19 మహమ్మారి పరిస్థితులు తప్పితే వరవరరావు ఈ కేసులో బెయిలు పొందే అవకాశాలే లేవని పేర్కొంది. 'జైలు అధికారులు నిర్ణీత సమయంలో స్పందించి వరవరరావుకు అవసరమైన వైద్య సదుపాయం సమకూర్చారు. మే 28న తలతిప్పడం తదితర సమస్యలు తలెత్తడంతో ఆయన్ను జేజే ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం జూన్‌ 1న ఆసుపత్రి నుంచి తిరిగి జైలుకు పంపించారు. అప్పటికి ఆయనలో కరోనా లక్షణాలు ఏమీలేవు. ఆరోగ్యం స్థిరంగా ఉంది' అని వెల్లడించింది. జేజే ఆసుపత్రి సూపరింటెండెంట్‌ సమర్పించిన వరవరరావు ఆరోగ్య నివేదిక ప్రకారం ఆయనకు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స అందించాల్సినంతగా ఆరోగ్య సమస్యలు లేవని ఎన్‌ఐఏ గుర్తుచేసింది.

నానావతి ఆసుపత్రిలో చికిత్స

ప్రస్తుతం వరవరరావు కొవిడ్‌-19, ఇతర రుగ్మతలకు ముంబయిలో నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన బెయిలు అభ్యర్థనపై ఈ నెల 20న బొంబాయి న్యాయస్థానం వాదనలు విన్న సంగతి తెలిసిందే. వరవరరావును పరామర్శించడానికి ఆయన కుటుంబానికి అనుమతిస్తే ఆ విషయాన్ని కోర్టుకు తెలియజేస్తామని ఎన్‌ఐఏ గురువారం తెలిపింది.

వరవరరావు విడుదలకు చర్యలు తీసుకోండి

పౌరహక్కుల నేత వరవరరావును జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎల్పీ మాజీ నేత కె.జానారెడ్డి గురువారం ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌లకు లేఖలు రాశారు. వరవరరావు అనారోగ్యంగా ఉన్నారని, తాజాగా కరోనాతో బాధపడుతున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు.

ఇదీ చదవండి: 'రాష్ట్రంలో కరోనా సామాజిక వ్యాప్తి దశ.. అప్రమత్తంగా ఉండాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.