భీమా కొరేగావ్ కేసు విచారణలో మహారాష్ట్రలోని తలోజా జైలులో వరవరరావు ఏడాదిన్నర నుంచి ఖైదీగా ఉంటున్నారు. ఇటీవల ఆయన ఆరోగ్యం దెబ్బతినడం వల్ల జైలు అధికారులు ముంబయిలోనే జేజే ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ జరిపిన పరీక్షల్లో వరవరరావుకు కరోనా సోకినట్లు తేలగా... సెయింట్ జార్జ్ ఆసుపత్రిలో చేర్చారు.
సెయింట్ జార్జ్ ఆసుపత్రిలో కరోనాకు చికిత్స పొందుతున్న వరవరరావు పరిస్థితి నిలకడగానే ఉందని, న్యూరోలాజికల్ సమస్యలు ఉన్నందున జేజే ఆసుపత్రికి చెందిన న్యూరాలజిస్ట్లు వరవరరావును పరిశీలించినట్లు తెలిపారు.
వరవరరావును పరిశీలించిన న్యూరో వైద్యులు ఆయన.. డెలీరియ్ అనే రుగ్మతతో బాధపడుతున్నట్లు వెల్లడించారు. మతిమరుపు, తరచుగా జ్వరం, మనసు స్థిమితంగా ఉండకపోవడం, అలజడిగా అనిపించడం ఈ వ్యాధి లక్షణాలు అని తెలిపారు. వరవరరావుకు న్యూరోలాజికల్, యూరోలాజికల్ చికిత్స అవసరమని నానావతి ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నట్లు చెప్పారు.
కొవిడ్-19 పాజిటివ్ వచ్చిన వరవరరావుకు మెరుగైన చికిత్స అందించాలని కుటుంబ సభ్యులు, ప్రజా సంఘాలు కోరుతున్నాయి.