Vallabhaneni vamshi: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పందించారు. నారా భువనేశ్వరిపై తాను పొరపాటున వ్యాఖ్యలు చేశానని.. ఆమెకు క్షమాపణ చెబుతున్నట్లు వెల్లడించారు. ఎమోషన్‌లో ఒక పదం తప్పుగా దొర్లినమాట వాస్తవమన్నారు. భువనేశ్వరిపై తాను చేసిన వ్యాఖ్యలకు బాధపడుతున్నట్లు తెలిపారు.
Nara bhuvaneshwari: తెదేపాలో తనకు అందరికంటే అత్యంత ఆత్మీయురాలు నారా భువనేశ్వరి అని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పేర్కొన్నారు. భువనేశ్వరిని తాను అక్క అని పిలుస్తానని చెప్పారు. అయితే, కమ్మ కులం నుంచి వెలివేస్తారనే భయంతో తాను క్షమాపణ చెప్పలేదని వల్లభనేని వంశీ తేల్చి చెప్పారు. తాను మనస్ఫూర్తిగానే క్షమాపణ చెబుతున్నట్లు వెల్లడించారు. అలాగే ఈ విషయంలో చంద్రబాబును కూడా క్షమాపణలు కోరుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: Chandra Babu Naidu: 'తెదేపా అధికారంలోకి వచ్చాకే అసెంబ్లీలో అడుగుపెడతా..'