రాష్ట్రవ్యాప్తంగా సూపర్ స్ప్రెడర్ల(super spreader)కు వ్యాక్సినేషన్(Vaccination) జరుగుతోంది. నిత్యం వందల మందిని కలిసే అవకాశమున్నవారిని సూపర్ స్ప్రెడర్లు(super spreader)గా గుర్తించి.. ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. 7.75 లక్షల మందికి టీకా వేయాలని నిర్ణయించగా.. ఇందులో పౌరసరఫరాశాఖ, జర్నలిస్టులు, ఆటో, క్యాబ్ డ్రైవర్లుతోపాటు చిరువ్యాపారులు ఉన్నారు. ఇప్పటికే వివిధ కేంద్రాల వద్ద లబ్ధిదారులు వరసలో ఉన్నారు. సాయంత్రం 4 గంటల వరకు టీకా పంపిణీ కొనసాగుతోంది. 3రోజులపాటు ప్రత్యేక డ్రైవ్(special drive) చేపట్టి వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో వ్యాక్సినేషన్(Vaccination) కార్యక్రమాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్(somesh kumar) పరిశీలించారు. వారం రోజుల్లో సూపర్ స్ప్రెడర్లకు టీకాలు పూర్తి చేస్తామని తెలిపారు.
కరోనా నుంచి రక్షణకు ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని... పశుసంవర్ధకశాఖ మంత్రి(minister) తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. హైదరాబాద్ సనత్‌నగర్‌లో సూపర్ స్పైడర్ల టీకా కార్యక్రమాన్ని మేయర్(mayor)తో కలిసి మంత్రి ప్రారంభించారు. వ్యాక్సిన్‌పై అపోహలు వీడి... అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మేడ్చల్‌లో కార్మికశాఖమంత్రి మల్లారెడ్డి సూపర్ స్పైడర్లకు అందించే టీకా కేంద్రాన్ని ప్రారంభించారు.
వరంగల్ పట్టణ జిల్లా కాజీపేట్, ధర్మసాగర్, వేలేరు మండలాల్లో కొవిడ్ సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. లబ్ధిదారులకు ముందుగానే అధికారులు టోకెన్‌లు జారీ చేశారు. టోకెన్లు పొందనివారు కూడా గుర్తింపుకార్డులు చూపించి వ్యాక్సిన్ వేసుకోవాలని అధికారులు తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. ఉదయం నుంచే లబ్ధిదారులు క్యూలో బారులు తీరారు. ఖమ్మంలోనూ పలు విభాగాలకు చెందినవారికి టీకాలు వేస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు, రామచంద్రాపురంలోని వ్యాక్సినేషన్ కేంద్రాలను ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి సందర్శించారు. హైదరాబాద్ వనస్థలిపురంలో వెయ్యిమందికి వ్యాక్సిన్ వేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. పది కౌంటర్లు ఏర్పాటు చేసి టీకాలు వేస్తున్నారు.